ఆ మ్యాచ్ కోసం మెస్సీ భారత్‌కు వ‌స్తున్నాడు..!

లెజెండరీ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీతో సహా అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు వచ్చే ఏడాది అంతర్జాతీయ మ్యాచ్ కోసం భారతదేశానికి రానుందట

By Medi Samrat  Published on  20 Nov 2024 8:30 PM IST
ఆ మ్యాచ్ కోసం మెస్సీ భారత్‌కు వ‌స్తున్నాడు..!

లెజెండరీ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీతో సహా అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు వచ్చే ఏడాది అంతర్జాతీయ మ్యాచ్ కోసం భారతదేశానికి రానుందట. ఈ విషయంపై కేరళ క్రీడా మంత్రి వి.అబ్దురహిమాన్ కీలక ప్రకటన చేశాడు. విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పర్యవేక్షణలో మ్యాచ్‌ను నిర్వహిస్తామని తెలిపారు. ఈ హై-ప్రొఫైల్ ఫుట్‌బాల్ ఈవెంట్‌ను నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ చరిత్రాత్మక మ్యాచ్ నిర్వహిస్తుందని, ఇందుకోసం రాష్ట్రంలోని వ్యాపారులు ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందిస్తారని చెప్పారు.

మెస్సీ చివరిసారిగా 2011లో భారత్‌లో ఆడాడు, కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో అర్జెంటీనా వెనిజులాతో జరిగిన అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌ గోల్‌లెస్ డ్రాగా ముగిసింది. గ్లోబల్ ఫుట్‌బాల్ ఐకాన్‌ అయిన మెస్సీకి సాంప్రదాయకంగా క్రికెట్ ఆధిపత్యం ఉన్న భారతదేశంలో అపారమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది.

Next Story