ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 మెగా వేలం రెండో రోజు కొనసాగుతోంది. ఈ రోజు వేలానికి వచ్చిన ఆటగాళ్లలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ అతడిని రూ.11.5 కోట్లకు దక్కించుకుంది. ఇక వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డొమినిక్ డ్రేక్స్ ను రూ.1.10 కోట్లకు, టీమ్ఇండియా యువ స్పిన్నర్ జయంత్ యాదవ్‌ను రూ.1.70 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. మన్‌దీప్ సింగ్‌ను ఢిల్లీ జట్టు రూ.1.10 కోట్లకు దక్కించుకుంది.
వెస్టిండీస్ ఆటగాడు ఒడియన్ స్మిత్‌ను రూ.6 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ. 4.20 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్, టీమ్ఇండియా ఆటగాడు శివమ్ దూబేను రూ.4 కోట్లకు చెన్నై, కృష్ణప్ప గౌతమ్ రూ.90లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్, భారత పేసర్ ఖలీల్ అహ్మద్‌ను రూ.5.25 కోట్లకు ఢిల్లీ, శ్రీలంక పేసర్ చమీరాను రూ.2కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేశాయి. టీమ్ఇండియా ఆటగాడు అజింక్య రహానేను అతని బేస్ ప్రైజ్ అయిన కోటి రూపాయలకు కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది.
ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ముంబై ఆటగాడు సౌరభ్ తివారి, ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్, టీమ్ఇండియా టెస్ట్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారాలను ఎవరూ కొనుగోలు చేయలేదు.