ఉసేన్‌బోల్ట్ దంపతులకు కవల పిల్లలు.. పేర్లు సోషల్ మీడియాలో వైరల్
Legendary sprinter Usain Bolt has twin boys.పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కు కవలలు జన్మించారు. తనకు ఇద్దరు
By తోట వంశీ కుమార్ Published on 21 Jun 2021 1:03 PM ISTపరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ కు కవలలు జన్మించారు. తనకు ఇద్దరు మగ పిల్లలు పుట్టినట్లు స్వయంగా బోల్ట్ సోషల్ మీడియా వేదికగా చెప్పాడు. అంతేకాదండోయ్ ఆ పిల్లల పేర్లను సైతం వెల్లడించాడు. ఆచిన్నారుల ఇద్దరి పేర్లు బాగున్నాయ్ అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం బోల్ట్ తనకు ఇద్దరు కవల కుమారులు జన్మించారనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే.. వారు ఏ రోజున పుట్టారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఆ చిన్నారులిద్దరికి థండర్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్ అని పేర్లు పెట్టినట్లు వెల్లడించాడు. బోల్ట్ భార్య బెన్నెట్ కూడా కవలల ఫోటోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఆ ఫోటోలో తన కూతురు ఒలింపియా లైటనింగ్ బోల్ట్ కూడా ఉన్నది. 2020 మేలో ఒలింపియా బోల్ట్ పుట్టింది. కానీ రెండు నెలల తర్వాత ఆమెకు పేరు పెట్టారు.
ఫ్యామిలీ ఫోటోను తాజాగా పోస్టు చేయడంతో బోల్ట్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ''లైట్నింగ్, థండర్? తుపాను రావొచ్చేమో'' అని పేర్కొంటూ ఓ నెటిజన్ కంగ్రాట్స్ చెప్పగా.. లైట్నింగ్, థండర్ బాగానే ఉన్నాయి గానీ, ఆ మూడో వాడి పేరే ఉసేన్ బోల్ట్ మధ్య పేరు 'సెయింట్ లియో' అని పెట్టడమే బాలేదేమోనంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Olympia Lightning Bolt ⚡️
— Usain St. Leo Bolt (@usainbolt) June 20, 2021
Saint Leo Bolt ⚡️
Thunder Bolt ⚡️@kasi__b pic.twitter.com/Jck41B8j3J
34 ఏళ్ల బోల్ట్ ఒలింపిక్స్ క్రీడల్లో 8 స్వర్ణాలను సాధించాడు. 2008, 2012, 2016 క్రీడల్లో గోల్డ్ మెడల్స్ గెలిచాడు. 2017లో రిటైర్ అయిన స్టార్ అథ్లెట్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. ఫాస్టెస్ట్ మ్యాన్‌గా చరిత్రలో స్థానం సంపాదించిన బోల్ట్.. 100, 200 మీటర్ల ఈవెంట్‌లో వరుసగా మూడు ఒలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించాడు.