భారత షట్లర్ లక్ష్య సేన్.. సెమీ ఫైనల్లో ప్రపంచ 2వ ర్యాంకర్ డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్‌తో వరుస గేమ్‌లలో ఓడిపోయాడు. అయితే 22 ఏళ్ల లక్ష్య ఆగస్ట్ 5న మలేషియాకు చెందిన లీ జి జియాతో కాంస్య పతకం పోరులో తలపడనున్నాడు. సెమీ-ఫైనల్ లో లక్ష్య మొదటి గేమ్‌లో మెజారిటీ భాగం ఆధిక్యంలో నిలిచాడు. విక్టర్ అక్సెల్‌సెన్ మీద మొదటి గేమ్ ను దాదాపుగా గెలిచాడు. అయితే ఆఖర్లో చేసిన తప్పులతో లక్ష్య 20-22తో తొలి గేమ్‌ను కోల్పోయాడు. రెండో గేమ్‌లో కూడా, లక్ష్య 7-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు, అయితే ఆ తర్వాత విక్టర్ అక్సెల్‌సెన్ దూకుడుగా ఆడడంతో రెండో గేమ్ ను 14-21తో కోల్పోవడమే కాకుండా.. మ్యాచ్ ను కూడా ఓడిపోయాడు
బ్యాడ్మింటన్ లో ఈ ఒలింపిక్స్ లో భారత్ అనుకున్న ఫలితాలను సాధించలేదు. రౌండ్ ఆఫ్ 16 గేమ్‌లో లక్ష్య సేన్ హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించగా, మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో పివి సింధు, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ కూడా ఇంటిబాట పట్టాయి. లక్ష్య సేన్ మెడల్ సాధిస్తాడని భారత్ అభిమానులు ఆశిస్తూ ఉన్నారు