వారెవ్వా.. అరంగ్రేటం మ్యాచ్‌లోనే ద్విశతకం.. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు
Kyle Mayers Smashes Unbeaten 210 On Debut.కరోనా మహమ్మారి కారణంగా 2020లో ఎక్కువగా క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు.
By తోట వంశీ కుమార్ Published on 7 Feb 2021 2:05 PM GMTకరోనా మహమ్మారి కారణంగా 2020లో ఎక్కువగా క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. ఆలోటును పూడ్చుతూ.. 2021లో జరుగుతున్న మ్యాచ్‌లు అంచనాలను తలక్రిందులు చేస్తూ క్రికెట్ ప్రేమికులను మునివేళ్లపై నిలబడేలా చేస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా టెస్టులో భారత్ సాధించిన విజయమే అందుకు ఉదాహారణ. తాజాగా అలాంటి విజయమే వెస్టిండీస్ జట్టు నమోదు చేసింది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టుల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 395 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ మరో మూడు వికెట్లు మిగిలి ఉండగా చేదించింది.
కాగా విండీస్ గెలుపులో మొత్తం క్రెడిట్ కైల్ మేయర్స్‌దే అని చెప్పాలి. అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టడమేగాక ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తం 310 బంతులు ఎదుర్కొన్న మేయర్స్ 201 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఆసియా గడ్డపై టెస్టుల్లో ఇదే అత్యధిక పరుగుల ఛేదనకాగా.. అరంగేట్రం మ్యాచ్‌లో అదీ రెండో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా కైల్స్ ఘనత సాధించాడు. అంతేకాకుండా అరంగేట్రం మ్యాచ్ లోనే ద్విశతకం సాధించిన తొలి వెస్టిండీస్ ఆటగాడిగా మేయర్స్ రికార్డు నమోదు చేశాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
🔸Fifth-highest score on Test debut
— ICC (@ICC) February 7, 2021
🔸Second-highest by a West Indies player
🔸Only the sixth batsman ever to score a fourth-innings Test double ton
Take a bow, Kyle Mayers 🌟#BANvWI pic.twitter.com/scirmxoJWr
సొంతగడ్డపై టాస్ గెలిచి బ్యాటింగ్ గెలిచిన బంగ్లాదేశ్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. మెహాది హసన్ 103, షకీబుల్ హాసన్ 68, షాబాద్ ఇస్లాం 59 లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 430 పరుగలకు ఆలౌటు అయింది. అనంతరం వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులకే ఆలౌట్ అయింది. బ్రాత్‌వైట్ 76, బ్లాక్ వుడ్ 68 మాత్రమే రాణించారు. దీంతో బంగ్లాదేశ్‌కు 171 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్సింగ్స్ లో మెమునల్ (115) శతకంతో పాటు లిటన్ దాస్(69) అర్థశతకం చేయడంతో.. 8 వికెట్ల నష్టానికి 223 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో విండీస్ ముందు 395 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.
ఆఖరి రోజు స్పిన్‌కు సహకరించే పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు అయినప్పటికి మేయర్స్ అద్బుతంగా ఆడాడు. చేధనలో వెస్టిండీస్ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో ఎన్ క్రుమా బోనర్ (86)తో కలిసి నాలుగో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు మేయర్స్. ఆ తరువాత టెయిలెండర్ దసిల్వా(20) కలిసి విండీస్ కు కలలో కూడా ఊహించని విజయాన్ని అందించాడు.