తొలి టీ20కి ముందు కివీస్‌కు షాక్‌.. కేన్ మ‌మా బాట‌లో జేమీస‌న్‌

Kyle Jamieson opts out of India T20Is to focus on Test series.భార‌త్‌తో తొలి టీ20 ముందే న్యూజిలాండ్ జ‌ట్టుకు మ‌రో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Nov 2021 9:57 AM GMT
తొలి టీ20కి ముందు కివీస్‌కు షాక్‌.. కేన్ మ‌మా బాట‌లో జేమీస‌న్‌

భార‌త్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ముందే న్యూజిలాండ్ జ‌ట్టుకు మ‌రో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. టీ20 సిరీస్‌ను నుంచి ఆ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ కైల్ జేమీస‌న్ త‌ప్పుకున్నాడు. టీమ్ఇండియాతో జ‌రిగే టెస్టు సిరీస్‌పై దృష్టి సారించేందుకే జేమీస‌న్‌కు విశ్రాంతి క‌ల్పించిన‌ట్లు కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. ఇప్ప‌టికే కివీస్ కెప్టెన్ విలియ‌మ్ స‌న్ కూడా ఇదే కార‌ణంగాతో టీ20 సిరీస్‌కు దూరం అయిన సంగ‌తి తెలిసిందే.

దీనిపై కోచ్ గ్యారీ స్టెడ్ మాట్లాడుతూ.. కేన్​ విలియమ్సన్, కైల్ జేమీసన్​తో మాట్లాడాకే టీ20 సిరీస్​లో వారికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఇలా చేయక త‌ప్ప‌డం లేద‌న్నారు. ఇక టెస్టు సిరీస్‌లో స్థానం ద‌క్కించుకున్న మ‌రికొంత మంది ఆట‌గాళ్లు కూడా టీ20 సిరీస్‌కు దూరం అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు. ప్ర‌పంచ‌టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌లో భార‌త్‌ను కివీస్ ఓడించి టెస్టుల్లో విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జైపూర్ వేదిక‌గా నేడు తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం సాయంత్రం 7.30గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో బోణి కొట్టాల‌ని ఇరు జ‌ట్లు బావిస్తున్నాయి. కాగా.. కొత్త కెప్టెన్ రోహిత్‌, కొత్త కోచ్ ద్రావిడ్ ఆధ్వ‌ర్యంలో భార‌త్ ఈ మ్యాచ్ ఆడ‌నుంది. ఇక రెండో మ్యాచ్ రాంచి వేదిక‌గా నవంబర్ 19, మూడో మ్యాచ్ కోల్​కతా వేదిక‌గా నవంబర్ 21 జ‌ర‌గ‌నుంది.

Next Story
Share it