కుల్దీప్ యాదవ్ టైమ్ అంత బాగోలేదేమో..!

Kuldeep Yadav in trouble overtaking COVID vaccine at unnamed location. తాజాగా కుల్దీప్ యాదవ్ కరోనాకు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

By Medi Samrat
Published on : 19 May 2021 3:55 PM IST

kuldeep yadav

కుల్దీప్ యాదవ్.. ఈ చైనామన్ బౌలర్ ను ఒకప్పుడు ఆకాశానికి ఎత్తేశారు. వైవిధ్యమైన బంతులతో వికెట్లను తీస్తూ.. భారత జట్టు మ్యాచ్ లో పట్టు సాధించేలా చేస్తుంటాడని చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల భారత జట్టులో అవకాశాలు కోల్పోయాడు. అతడి బౌలింగ్ లో కూడా నిలకడ మిస్ అయ్యింది. ఐపీఎల్ కోల్ కతా నైట్ రైడర్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు.

తాజాగా కుల్దీప్ యాదవ్ కరోనాకు వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అదే అతడిని చిక్కుల్లో పడేసింది. అదేంటి వ్యాక్సిన్ వేయించుకోవడం మంచి పనే కదా.. ఎంతో మంది సెలెబ్రిటీలు వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. అయితే కుల్దీప్ యాదవ్ వ్యాక్సిన్ వేయించుకుంది వ్యాక్సినేషన్ సెంటర్ లో కాకపోవడమే ఇక్కడ వివాదానికి దారి తీసింది.

కుల్దీప్‌ యాదవ్‌ లక్నో లోని స్థానిక గోవింద్‌నగర్‌లోని జగదీశ్వర్‌ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. ఆస్పత్రికి వెళ్లకుండా కాన్పూర్‌ నగర్‌ నిగం అతిథి గృహంలోనే టీకా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను కుల్దీప్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ పోస్టు కాన్పూర్‌ జిల్లా అధికారులను కూడా చూశారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కుల్దీప్‌ వ్యాక్సిన్ వేయించుకున్నాడని.. అది కూడా వ్యాక్సినేషన్ సెంటర్ లో కాదని తెలుసుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన కాన్పూర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ అలోక్‌ తివారి విచారణకు ఆదేశించారు. ఎవరి అనుమతితో గెస్ట్‌హౌజ్‌లో కుల్దీప్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నాడో తెలపాలని అధికారులను కోరారు. ప్రధాని దగ్గర నుండి పలువురు సెలెబ్రిటీలు వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్లి వ్యాక్సిన్లను వేసుకుంటూ ఉంటుంటే.. కుల్దీప్ యాదవ్ ఇలా చేయడాన్ని నెటిజన్లు తప్పుబడుతూ ఉన్నారు.


Next Story