కొరియా ఓపెన్.. సెమీస్‌లో ఓడిన పీవీ సింధు
Korea Open PV Sindhu fails to decode An Seyoung.కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నిలో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం
By తోట వంశీ కుమార్ Published on
9 April 2022 6:14 AM GMT

కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నిలో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు కథ ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో పీవీ సింధు ఓటమి పాలైంది. కొరియా షట్లర్ ఆన్ సుయాంగ్ చేతితో 14-21, 17-21 తో వరుస సెట్లలో ఓడింది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌తో కలిసి ఇప్పటి వరకు ఆన్ సుయాంగ్ తో నాలుగు సార్లు తలపడిన సింధు అన్నింటిల్లోనూ ఓటమి పాలు కావడం గమనార్హం.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో శుక్రవారం మూడో సీడ్ సింధు 21-10, 21-16తో బుసానన్ ఓంగ్‌బమ్రున్‌ఫాన్ (థాయ్‌లాండ్)పై అలవోక విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. శనివారం సెమీఫైనల్ మ్యాచ్‌లో సింధు అంచనాలను అందుకోలేకపోయింది.
Next Story