నేను ప‌రుగులే చేయ‌ట్లేదు అని అన్నాను.. బాగా న‌వ్వుకున్నాం..

Kohli's hilarious chat with Orange Cap holder of IPL 2022. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం భారత క్రికెట్ అభిమానులలో ఎంతో ఆనందాన్ని నింపింది

By Medi Samrat  Published on  20 May 2022 12:15 PM GMT
నేను ప‌రుగులే చేయ‌ట్లేదు అని అన్నాను.. బాగా న‌వ్వుకున్నాం..

విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం భారత క్రికెట్ అభిమానులలో ఎంతో ఆనందాన్ని నింపింది. గురువారం గుజరాత్ టైటాన్స్‌పై 54 బంతుల్లో 73 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు తిరిగి ఫామ్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది. మ‌ళ్లీ ఫాంలోకి రావ‌డంపై విరాట్ స్పందించాడు. ప్ర‌స్తుత ఐపీఎల్‌ సీజన్‌లో తాను టీమ్ లో స‌రిగ్గా రాణించలేకపోయానని, దీంతో నిరాశకు గురయ్యానని అన్నాడు. ఈ మ్యాచ్ లో బాగా ఆడడంతో త‌మ జ‌ట్టు మంచి స్థితిలో నిలిచిందని తెలిపాడు. అంచనాలకు తగ్గట్టు రాణించాలంటే కొన్ని విషయాలను పట్టించుకోకూడ‌ద‌ని చెప్పాడు. తాను ఈ మ్యాచ్ లో రాణించేందుకు చాలా కష్టపడ్డాన‌ని తెలిపాడు. ఈ మ్యాచ్‌కు ముందు నెట్స్ లో దాదాపు 90 నిమిషాల పాటు సాధన చేశాన‌ని, దీంతో చాలా ప్రశాంతంగా మ్యాచులో ఆడ‌గ‌లిగాన‌ని అన్నాడు. షమీ బౌలింగ్ లో తొలిషాట్ కొట్టిన‌ప్ప‌టి నుంచే బాగా ఆడతాననే నమ్మకం కలిగిందని తెలిపాడు.

33 ఏళ్ల కోహ్లి రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌తో జరిగిన సంభాషణ గురించి చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్‌లో హర్భజన్ సింగ్‌తో కోహ్లి మాట్లాడుతూ "రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత జోస్ బట్లర్ నా వద్దకు వచ్చి నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నానని అన్నాడు. అప్పుడు నేను నువ్వేమో ఆరెంజ్ క్యాప్ ధరించి ఉన్నావు. నేనేమో పరుగులు చేయలేకపోతున్నాను.. నాతో ఏమి అడుగుతావు. అని అనగానే బాగా నవ్వుకున్నాము." అని చెప్పాడు. బట్లర్ అద్భుతమైన ఆటతీరును కనబరిచి టోర్నమెంట్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన సంగతి తెలిసిందే..! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీని వదులుకున్న భారత మాజీ కెప్టెన్, దాదాపు మూడేళ్లుగా వంద పరుగులు చేయలేదు. కోహ్లీ ఎప్పుడు సెంచరీ బాదుతాడా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.




Next Story