ధోనీ చెత్త రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ
Kohli gets out for duck equals MS Dhoni's unwanted record.విరాట్.. ధోనీ చెత్త రికార్డును సమం చేయడం విశేషం. నాలుగో టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ శుక్రవారం డకౌటయ్యాడు.
By తోట వంశీ కుమార్ Published on 5 March 2021 4:20 PM ISTప్రస్తుతం క్రికెట్ ఆడే వారిలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు అంటే.. ఎక్కువ మంది చెప్పే సమాధానం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. పరుగుల యంత్రంగా, రికార్డుల రారాజుగా అతడికి పేరుంది. తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా.. నరేంద్ర మెడీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులోనూ కోహ్లీ ఓ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. అది ఓ చెత్త రికార్డు. కొంత కాలంగా ధోనీ రికార్డులను వేటాడుతున్న విరాట్.. ధోనీ చెత్త రికార్డును సమం చేయడం విశేషం. నాలుగో టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన విరాట్ శుక్రవారం డకౌటయ్యాడు.
బెన్ స్టోక్స్ వేసిన 26వ ఓవర్ నాలుగో బంతిని విరాట్ కోహ్లీ ఫ్లిక్ చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్‌కి తాకి కీపర్ బెన్ ఫోక్స్ చేతిలో పడింది. అనూహ్యంగా దూసుకొచ్చిన షార్ట్‌పిచ్ బంతి ఆడలేక కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ డకౌట్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చెత్త రికార్డును విరాట్ సమం చేయడం విశేషం. కోహ్లీకి కెప్టెన్‌గా టెస్టుల్లో ఇది 8వ డకౌట్. గతంలో ధోనీ కూడా కెప్టెన్‌గా 8సార్లు డకౌటయ్యాడు. ఇప్పుడు విరాట్ అతని రికార్డును సమం చేశాడు. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ డకౌట్ కావడం ఇది రెండోసారి. అంతేకాదు కోహ్లీ మరో చెత్త రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కంటే కూడా కోహ్లీ ఎక్కువసార్లు డకౌట్ కావడం విశేషం. బుమ్రా టెస్టుల్లో 9సార్లు డకౌట్ కాగా.. విరాట్ 12సార్లు డకౌటయ్యాడు. టెస్టుల్లో పేసర్ ఇషాంత్ శర్మ 32 డకౌట్లతో టాప్‌లో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్.. విరాట్‌ను ఔట్ చేయడంతో టెస్టుల్లో అత్యధికంగా ఐదు సార్లు పెవిలియన్ చేర్చాడు. మరే బ్యాట్స్‌మెన్ కూడా స్టోక్స్ చేతిలో ఇన్నిసార్లు వికెట్ సమర్పించుకోలేదు. డీన్ ఎల్గర్, మైఖేల్ క్లార్క్, పుజారా ఇది వరకు నాలుగు సార్లు స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యారు. కాగా.. ఈ టెస్టులో విరాట్ కోహ్లీ ధోనికి సంబంధించిన మరో రికార్డును సమం చేశాడు. భారత్ తరుపున అత్యధిక టెస్టులకు కెప్టెన్సీ వహించిన మహీ రికార్డు(60)ను కోహ్లీ సమం చేశాడు. మూడో టెస్టు విజయంతో స్వదేశంలో అత్యధిక మ్యాచ్‌లు గెలుపొందిన కెప్టెన్ల జాబితాలో ధోని(21)ని కోహ్లీ(22) అధిగమించాడు.