Video : అందరితో ఆడడం ఇష్టం.. కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం
KL రాహుల్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ వేలంలోకి విడుదల చేసింది. దీంతో అతడు రాబోయే IPL వేలంలో భారీ ధర పలకనున్నాడు
By Medi Samrat
KL రాహుల్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ వేలంలోకి విడుదల చేసింది. దీంతో అతడు రాబోయే IPL వేలంలో భారీ ధర పలకనున్నాడు. కేఎల్ రాహుల్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీల మధ్య పోటీ ఉండవచ్చు. IPL 2025 వేలం నవంబర్ 24, 25 తేదీలలో జెడ్డాలో నిర్వహించనున్నారు.
ఐపీఎల్ ప్రసారకర్తతో మాట్లాడిన రాహుల్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2025 IPLలో తన సహచరుడిగా ఎవరు ఉండాలనుకుంటున్నారని అతడిని అడిగారు. రోహిత్ శర్మ, MS ధోనీ లేదా విరాట్ కోహ్లీ. ముగ్గురు ఆటగాళ్లను (ధోని, కోహ్లీ, రోహిత్) ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. రాహుల్ ఇచ్చిన సమాధానానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
32 ఏళ్ల రాహుల్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా.. 'కెఎల్ ఇన్ ఎ పికిల్' విభాగంలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. రాహుల్‌ను అడిగారు- రోహిత్, విరాట్, ధోనీ నుండి ఒక IPL సహచరుడిని ఎంచుకోండి. దీనికి రాహుల్.. "నాకు తెలియదు" అని బదులిచ్చారు. ఇది కష్టమైన ప్రశ్న. మీరు నన్ను ఇబ్బందుల్లోకి నెట్టారు. అందరితో ఆడడం చాలా ఇష్టం. దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టం అని పేర్కొన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. అతను 8,004 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 6,628 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఎంఎస్ ధోని 5,243 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 4,683 పరుగులతో 11వ స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం కేఎల్ రాహుల్ దృష్టి అంతా రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపైనే ఉంది. అయితే.. రాహుల్ టెస్టు ఫార్మాట్‌లో ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. అతను ఆస్ట్రేలియాలో తన ఫామ్‌ను మెరుగుపరుచుకుని మెరుగైన ప్రదర్శన చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.