Video : కుల్దీప్-రింకూ మంచి స్నేహితులు.. చెంపదెబ్బ వివాదానికి KKR విరుగుడు మంత్రం..!

నిన్న‌టి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, రింకు సింగ్ మధ్య చెంపదెబ్బ వివాదం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

By Medi Samrat
Published on : 30 April 2025 3:15 PM IST

Video : కుల్దీప్-రింకూ మంచి స్నేహితులు.. చెంపదెబ్బ వివాదానికి KKR విరుగుడు మంత్రం..!

నిన్న‌టి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, రింకు సింగ్ మధ్య చెంపదెబ్బ వివాదం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, KKR మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత.. కుల్దీప్ రింకూని రెండుసార్లు చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కుల్దీప్ రింకూను ఎందుకు కొట్టాడో అని అభిమానులు ఆశ్చర్యపోయారు.

వీడియోలో కుల్దీప్ సరదాగా రింకూ ముఖంపై రెండుసార్లు కొట్టినట్లు క‌నిపించింది. దీంతో రింకూ గందరగోళానికి గురయ్యాడు. భారత జట్టులో కలిసి ఆడే కుల్దీప్, రింకూ మధ్య మంచి స్నేహం ఉంది.. అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న‌ జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్లిద్దరూ సంతోషంగా కనిపించారు.

రింకూ నవ్వుతూ మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే ఏదో సమస్యపై కుల్దీప్ రింకూని చెంపదెబ్బ కొట్టాడు. దీని తర్వాత రింకూ కుల్‌దీప్‌ను ఆశ్చర్యంగా చూస్తాడు.. కుల్దీప్ మళ్లీ రింకూను చెంపదెబ్బ కొడ‌తాడు. దీంతో రింకూ సీరియ‌స్‌గా చూస్తాడు.

అయితే.. వివాదం తలెత్తిన తర్వాత KKR.. కుల్దీప్, రింకు స్నేహంగా ఉన్న ఫోటోల‌తో వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఇద్దరూ 'ప్రేమ' గుర్తు చేస్తూ, ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని నిలబడి ఉన్నారు. వీరిద్దరి మధ్య ఉన్న గాఢమైన స్నేహాన్ని వీడియో మరింతగా చూపుతోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

మ్యాచ్ విష‌యానికొస్తే.. ఢిల్లీని ఓడించి ప్లేఆఫ్‌కు చేరుకోవాలనే ఆశను KKR సజీవంగా ఉంచుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ KKR 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అంగ్క్రిష్ రఘువంశీ 44 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అనంత‌రం ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసి వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది.

Next Story