కీర‌న్ పోలార్డ్ చ‌నిపోయాడు..? అస‌లు నిజం ఏంటంటే..?

Kieron Pollard busy playing T10 league as fake video of fatal car accident goes viral.ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jan 2021 7:55 AM GMT
కీర‌న్ పోలార్డ్ చ‌నిపోయాడు..? అస‌లు నిజం ఏంటంటే..?

ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా వాడ‌కం చాలా పెరిగింది. దీంతో ఫేక్‌న్యూస్‌లు కూడా ఎక్కువ‌గానే స‌ర్య్కులేట్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియాలో వ‌చ్చింది నిజం అని న‌మ్మి.. అది నిజంగా నిజమో.. కాదో అని తెలుసుకోకుండానే ప‌లువురు స్టార్లు చ‌నిపోయిన‌ట్లు భావించిన అభిమానులు వారి ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని ట్వీట్లు చేయ‌డం ప‌రిపాటిగా మారింది. తాజాగా వెస్టిండీస్ ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్‌, ముంబై ఇండియ‌న్స్ ఆట‌గాడు కీర‌న్ పొలార్డ్ చ‌నిపోయిన‌ట్లు రెండు రోజుల క్రితం సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

ప్ర‌స్తుతం కీర‌న్ పోలార్డ్ యూఏఈలో ఉన్నాడు. అబుదాబి టీ10 లీగ్‌లో ఆడేందుకు అక్క‌డికి వెళ్లాడు. ఈ క్ర‌మంలో అక్క‌డ పొలార్డ్ కారు యాక్సిడెంట్ అయ్యింద‌ని.. సంఘ‌ట‌నా స్థ‌లంలోనే చ‌నిపోయాడ‌ని కొన్ని యూట్యూబ్ ఛాన‌ళ్లు ప్ర‌సారం చేశాయి. రెండు కార్లు ఢీకొన్న ఫోటోతో పాటు.. ఒక డెడ్‌బాడీని అంబులెన్స్‌లో ఎక్కిస్తున్న ఫోటోని అందులో చూపించాయి. దీంతో క్రీడాభిమానులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. పొలార్డ్ నిజంగానే చ‌నిపోయాడ‌ని భావించిన కొంద‌రు.. సోష‌ల్ మీడియా వేదిక‌గా పొలార్డ్ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాంటూ ట్వీట్లు చేశారు.


అయితే.. అవ‌న్నీ ఫేక్‌న్యూస్ అని తేలింది. పొలార్డ్‌కు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని తెలిసింది. అబుదాబి టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ టీమ్‌కి కీరన్ పొలార్డ్ నాయకత్వం వహిస్తున్నాడు. గురువారం, శుక్రవారం జరిగిన మ్యాచులలో పొలార్డ్ ఆడాడు. దీంతో అత‌డి అభిమానులు ఒక్క‌సారిగా ఊపిరిపీల్చుకున్నారు. కరోనా వైరస్ ఆందోళనల కారణంగా పొలార్డ్ ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ పర్యటన నుంచి వైదొలిగిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ఆట‌గాడు ఎక్కువ‌గా ప్రైవేట్ లీగ్‌ల‌లో ఆడి బాగా పేరు సంపాదించాడు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు అన్నీ లీగుల్లో ఆడాడు. అన్ని లీగ్‌ల్లో కలుపుకొని 500 టీ20 మ్యాచ్‌లకు పైగా ఆడాడు. ఇక ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో చాలా కాలంగా ముంబై త‌రుపున ఆడుతున్నాడు. 2021 సీజ‌న్ కోసం ముంబై రూ.5.4కోట్ల‌కు రిటైన్ చేసుకుంది.




Next Story