లాంగర్ రాజీనామా.. ఆసీస్ కొత్త కోచ్ ఎవరంటే
Justin Langer resigns as Australia cricket coach following CA board meeting.ఆస్ట్రేలియా జట్టు ప్రధాన
By తోట వంశీ కుమార్
ఆస్ట్రేలియా జట్టు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. కోచ్‌గా కొనసాగేందుకు జూన్ వరకు ఒప్పందం ఉన్నా ఫిబ్రవరిలోనే తను జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో తాత్కాలిక హెడ్‌కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నియమించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
JUST IN: @CricketAus confirms Andrew McDonald has been appointed interim head coach of the Aussie men's team. More to come.
— cricket.com.au (@cricketcomau) February 5, 2022
లాంగర్ కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియా అద్భుతమైన విజయాలు సాధించింది. గతేడాది టీ 20 ప్రపంచకప్‌ను గెలవగా.. ఇటీవల ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను 4-0 తో కైవసం చేసుకుంది. అయితే.. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ.. కొందరు ఆటగాళ్లతో పాటు గవర్నింగ్ బోర్డులోని కొందరు సభ్యులతో విభేదాలు వచ్చిన నేపథ్యంలో సుధీర్ఘకాలం పాటు కోచ్‌గా కొనసాగేందుకు లాంగర్ చేసిన ప్రతిపాదనకు బోర్డు సానుకూలంగా స్పందించిలేనట్లు తెలుస్తోంది. దీంతో పదవి కాలం ముగియనప్పటికీ.. లాంగర్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.
'మా క్లైంట్ జస్టిన్ లాంగర్ ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు సభ్యులు శుక్రవారం రాత్రి వరకు లాంగర్ భవిష్యత్తు గురించి సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే కొత్త ఒప్పందంపై వారు సముఖంగా లేరు. అందుకే లాంగర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నారు అని లాంగర్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎస్‌ఈజీ' ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇక ఆస్ట్రేలియా కొత్త కోచ్‌గా ఆండ్రూకు బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆస్ట్రేలియా తరఫున 2009లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆండ్రూ అదే ఏడాది తన చివరి మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో భారత్ 2009లో జరిగిన సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళరూకు ప్రాతినిథ్యం వహించాడు.