జట్టులో ఉంచుకోనందుకు 'బట్లర్' బాధను వ్యక్తం చేశాడా..?
IPL 2025 మెగా వేలానికి ముందు మొత్తం 10 జట్లు తమ రిటైన్ మరియు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. రాజస్థాన్ రాయల్స్ ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2024 7:45 AM ISTజట్టులో ఉంచుకోనందుకు 'బట్లర్' బాధను వ్యక్తం చేశాడా..?
IPL 2025 మెగా వేలానికి ముందు మొత్తం 10 జట్లు తమ రిటైన్ మరియు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. రాజస్థాన్ రాయల్స్ ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకుంది. ఇందులో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేరు లేదు. జోస్ బట్లర్ 2018 నుండి రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. కానీ ఈసారి అతన్ని రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసింది. రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసిన తర్వాత జోస్ బట్లర్ జట్టుకు భావోద్వేగ సందేశాన్ని రాశాడు.
రాజస్థాన్ రాయల్స్‌కు కీలక ఆటగాడిగా ఉన్న జోస్ బట్లర్‌ను ఐపిఎల్ 2025 మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ రిటైన్ చేయలేదు. ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్, విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అయిన జోస్ బట్లర్ ను ఉంచకపోవడం నిజంగా షాకింగ్ నిర్ణయం. బట్లర్ 2018 నుండి బట్లర్ అనేక విజయాలలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.
జోస్ బట్లర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో RR జెర్సీలో ఉన్న ఫోటోలను పంచుకుంటూ.. 7 అద్భుతమైన సీజన్‌లలో ఫ్రాంచైజీతో ఉన్న అనుబంధం పట్ల ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని రాశారు. 2018 నా క్రికెట్ కెరీర్‌లో అత్యుత్తమ సంవత్సరానికి నాంది పలికింది. గత ఆరేళ్లుగా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు గులాబీ రంగు జెర్సీ ద్వారా. నన్ను, నా కుటుంబాన్ని ముక్తకంఠంతో స్వాగతించినందుకు ధన్యవాదాలు. ఇంకా చాలా వ్రాయవచ్చు.. కానీ ఇక్కడ వదిలేద్దాం.. అని రాసుకొచ్చాడు.
జోస్ బట్లర్ గురించి చెప్పాలంటే అతడు 2016లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. మొత్తం 107 IPL మ్యాచ్‌లు ఆడి 3,582 పరుగులు చేశాడు. IPL 2024లో జోస్ బట్లర్ 11 మ్యాచ్‌లలో 359 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 107 నాటౌట్.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్లకు నిలబెట్టుకోగా.. యశస్వి జైస్వాల్‌ను కూడా అదే మొత్తానికి జట్టులో ఉంచారు. యువ ఆటగాళ్లు రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌లను రూ.14 కోట్లకు అట్టిపెట్టుకున్నారు. 4 కోట్లకు సందీప్ శర్మ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ పవర్-హిటర్ షిమ్రాన్ హెట్మెయర్ రాజస్థాన్ రాయల్స్ తరఫున రూ. 11 కోట్లకు మాత్రమే ఓవర్సీస్ రిటెన్షన్‌లో నిలిచాడు.