ఈసీబీ సంచలన నిర్ణయం.. టెన్షన్‌లో మూడు ఐపీఎల్ జట్లు..!
భారత్-పాక్ యుద్ధం కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడిన ఐపీఎల్-2025 కొత్త షెడ్యూల్ వెలువడింది.
By Medi Samrat
భారత్-పాక్ యుద్ధం కారణంగా వారం రోజుల పాటు వాయిదా పడిన ఐపీఎల్-2025 కొత్త షెడ్యూల్ వెలువడింది. సోమవారం అర్థరాత్రి బీసీసీఐ ఈ విషయాన్ని ప్రకటించింది. మే 17 నుండి లీగ్ మళ్లీ ప్రారంభమవుతుందని తెలిపింది. అయితే ఇంగ్లండ్‌కు చెందిన కొంతమంది ఆటగాళ్లు ఇందులో ఆడే అవకాశం చాలా తక్కువ. దీనికి కారణం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు నిర్ణయమే.
మే 22 నుంచి జింబాబ్వేతో ఇంగ్లాండ్ తన ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగనుంది. దీని తర్వాత ఇంగ్లండ్ వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. మే 29 నుంచి వన్డే సిరీస్, జూన్ 6 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్నాయి.
ఈ సిరీస్‌లన్నింటికీ ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. కొత్త కెప్టెన్ హ్యారీ బ్రూక్ జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. జోస్ బట్లర్ గుజరాత్ టైటాన్స్‌లో ఆడుతుండగా.. IPL-2025లో ఆడుతున్న ఐదుగురు ఆటగాళ్లను సెలెక్టర్లు ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్, విల్ జాక్వెస్ ముంబై ఇండియన్స్, జాకబ్ బేతెల్ RCB, ఫిల్ సాల్ట్ RCBలలో ఆడుతున్నారు. అయితే జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. జూన్ 6 నుంచి ప్రారంభం కానున్న టీ20 జట్టులో వీరంతా ఉన్నారు.
వన్డే జట్టులో రెస్ట్ బట్లర్, ఆర్చర్, జాక్వెస్, బేతెల్‌లు ఎంపికయ్యారు. కాగా టీ20 జట్టులో బెతెల్, బట్లర్, జాక్వెస్ కూడా ఎంపికయ్యారు. సాల్ట్, జామీ ఓవర్టన్ కూడా టీ20 జట్టులో ఉన్నారు. ఓవర్టన్ వన్డే జట్టులోనూ ఎంపికయ్యాడు. అతను IPLలో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నాడు. కానీ ఈ జట్టు ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించింది. దీని కారణంగా ఓవర్‌టన్‌కు ఎటువంటి సమస్య ఉండదు.
బట్లర్, బెతెల్ రాకపోతే గుజరాత్, ఆర్సీబీల కష్టాలు పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు జట్లూ ప్లేఆఫ్‌కు చేరువలో ఉన్నాయి. గుజరాత్ విజయాలలో బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఫిల్ సాల్ట్ గాయం తర్వాత, RCB బెతెల్‌కు అవకాశం ఇచ్చింది. అతను ఆకట్టుకున్నాడు. అందువల్ల RCB అతన్ని కోల్పోవడానికి ఇష్టపడదు. ఆర్చర్ విషయానికి వస్తే.. రాజస్థాన్ కూడా ప్లేఆఫ్ రేసుకు దూరమయ్యింది. అతను కూడా ఐపీఎల్ ఆడిన తర్వాత తన దేశం తరఫున ఆడటానికి ఎలాంటి సమస్య ఎదురుకాదు.