బాప్ రే బట్లర్.. పరుగులే కాదు.. ప్రైజ్‌మనీ విషయంలోనూ
Jos Buttler becomes the richest cricketer after 6 awards.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో ఇంగ్లాండ్
By తోట వంశీ కుమార్ Published on 1 Jun 2022 1:50 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ తన బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరించాడు. రాజస్థాన్ రాయల్స్ తరుపున బరిలోకి దిగిన ఈ ఆటగాడు ఈ సీజన్‌లో నాలుగు శతకాలు బాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 17 మ్యాచుల్లో 863 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. పరుగులు చేయడంతోనే కాదు అవార్డులు అందుకోవడంతో చరిత్ర సృష్టించాడు బట్లర్. ఈ సీజన్‌లో బట్లర్ మొత్తం 37 అవార్డులు అందుకుని వాటి ద్వారా రూ.95 లక్షల ప్రైజ్‌మనీ ని తన ఖాతాలో వేసుకున్నాడు.
బట్లర్ అందుకున్న అవార్డులు ఇవే..
ఆరెంజ్ క్యాప్(సీజన్‌లో అత్యధిక పరుగులు 863), గేమ్ చేంజర్, అత్యంత విలువైన ఆటగాడు, అత్యధిక ఫోర్లు (83), అత్యధిక సిక్సర్లు (45), పవర్ ప్లేయర్ పురస్కారాలు అందుకున్నాడు. ఒక్కొ అవార్డుకు పదేసి లక్షల చొప్పున మొత్తం రూ.60లక్షలు గెలుచుకున్నాడు. లీగ్ దశలోని మ్యాచ్‌ల్లో లభించిన అవార్డుల కింద ఒక్కో అవార్డుకు రూ. లక్ష రూపాయల చొప్పున రూ. 45 లక్షలు అందుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్‌లో అవార్డుల ద్వారానే బట్లర్ ఏకంగా రూ.95 లక్షలు ఆర్జించాడు. ఇక ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ బట్లర్‌ను రూ.10 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సీజన్‌లో రాజస్థాన్ అంచనాలను మించి రాణించింది అంటే అందుకు బట్లర్ ప్రధాన కారణం. బట్లర్ బ్యాట్‌తో రాణించిన ప్రతీ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. క్వాలిఫయర్-2లో బెంగళూరుపై శతకం సాధించి రాజస్థాన్‌ను ఫైనల్‌కు తీసుకువచ్చాడు. అయితే.. ఫైనల్‌లో బట్లర్ 39 పరుగులు మాత్రమే చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్లు అంతా విఫలం కావడంతో 130 పరుగులకే రాజస్థాన్ పరిమితమైంది. స్వల్ప లక్ష్యాన్ని చేదించిన గుజరాత్ తొలి సారి టైటిల్‌ను అందుకుంది.