మల్టీ టాలెంటెడ్ తను.. ఆటలో అదరగొట్టడమే కాదు.. పాటతోనూ అలరిస్తది
Jemimah Rodrigues and her BBL teammates sing Channa Mereya. భారత క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ఎక్కడికి వెళ్లినా భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది.
By Medi Samrat Published on
30 Oct 2022 1:15 PM GMT

భారత క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ఎక్కడికి వెళ్లినా భారతీయ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియోలో 22 ఏళ్ల జెమిమా 'ఏ దిల్ హై ముష్కిల్' చిత్రం నుండి 'చన్నా మేరేయా' పాట పాడటం చూడొచ్చు. గతంలో అనేక సందర్భాల్లో గిటార్‌ను వాయిస్తూ సందడి చేసిన రోడ్రిగ్స్, తాజాగా ఆమె టీమ్ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అరిజిత్ సింగ్ పాటను ప్లే చేయడం చూడవచ్చు. ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసిన క్లిప్‌లో, బిగ్ బాష్ లీగ్‌లో ఉన్న ఆమె సహచరులు కోరస్ పాడడాన్ని కూడా గమనించవచ్చు.
"Went a lil Desi with the Stars.How good are they at bollywood songs?!#ChannaMereya Also such a good win today!! We keep going @starsbbl #WBBL08," అంటూ పోస్టు పెట్టింది జెమిమా. ఆమెను పలువురు అభినందిస్తూ కనిపించారు. జెమిమా మహిళల బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరపున ఆడుతుంది.
Next Story