గాయం కారణంగా బంగ్లాదేశ్ పర్యటనకు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ దూరం అయిన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌కు షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేశారు. అయితే.. టెస్టులకు మాత్రం ఎవరిని ఎంపిక చేయలేదు. తాజాగా టెస్టు సిరీస్‌కు షమీ స్థానాన్ని జయదేవ్ ఉనద్కత్ తో భర్తీ చేశారు.
2010లో దక్షిణాఫ్రికా పై జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా జయదేవ్ ఉనద్కత్ అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. అయితే.. ఆ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ మ్యాచ్ తరువాత మరో టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. దాదాపు 12 ఏళ్ల తరువాత మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం ఉనద్కత్‌కు వచ్చింది.
ఇటీవల ముగిసిన విజయ్ హాజారే టోర్నీని సౌరాష్ట్ర జట్టు సొంతం చేసుకుంది. ఈ జట్టుకు ఉనద్కత్ సారథ్యం వహించాడు. 19 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దేశవాలీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో ఉనద్కత్‌కు మళ్లీ భారత జట్టు నుంచి పిలుపువచ్చింది. 31 ఏళ్ల ఉనద్కత్ ఇప్పటి వరకు 86 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 311 వికెట్లు పడగొట్టాడు.
ఇక భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య డిసెంబర్ 14 నుంచి రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది.