న్యాయ‌వాదిని పెళ్లిచేసుకున్న టీమ్ఇండియా క్రికెట‌ర్‌

Jaydev Unadkat Gets Married.మ‌రో టీమ్ఇండియా క్రికెట‌ర్ ఓ ఇంటివాడ‌య్యాడు.ఫాస్ట్ బౌల‌ర్ జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్.. న్యాయవాదిగా ప‌నిచేస్తున్న రిన్నీని పెళ్లి చేసుకున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2021 3:34 AM GMT
Jaydev Unadkat Gets Married

మ‌రో టీమ్ఇండియా క్రికెట‌ర్ ఓ ఇంటివాడ‌య్యాడు. ఫాస్ట్ బౌల‌ర్ జ‌య‌దేవ్ ఉన‌ద్క‌త్.. రినీ కంటారియా అనే యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు. గుజరాత్ లోని ఆనంద్ లో ఉన్న మధుబన్ రిసార్ట్ లో అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహ వేడుక జ‌రిగింది. న్యాయవాదిగా ప‌నిచేస్తున్న రిన్నీ కంటారియాతో గ‌తేడాది మార్చి 15న జ‌య‌దేవ్ నిశ్చితార్థం జ‌రిగింది. పెళ్లి సంబంధించిన విష‌యాన్ని జ‌య‌దేవ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో భార్య‌తో క‌లిసి ఉన్న ఫోటోను ఈ సంద‌ర్భంగా షేర్ చేశాడు.


'2 ఫిబ్ర‌వ‌రి 2021న మా వివాహం జ‌రిగినందుకు చాలా సంతోషంగా ఉంది. కుటుంబ స‌భ్యులు, మిత్రులు, స‌న్నిహితుల మ‌ధ్య పెళ్లి చేసుకున్నాం. మాపై మీరు చూపించిన ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు. మేం సరికొత్త జీవితం ఆరంభిస్తున్న నేప‌థ్యంలో మీ ఆశ్వీరాదాలు కోరుతున్నాం. మీ రిన్నీ, జ‌య‌దేవ్' అని ట్వీట్ చేశాడు.

దీంతో కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. కాగా సౌరాష్ట్ర పేసర్‌ అయిన జయదేవ్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2021 సీజ‌న్‌కు రాజ‌స్థాన్ అత‌డిని అట్టిపెట్టుకుంది. ఇక 2010లో సంప్రదాయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఉనాద్కత్, 2013లో టీమిండియా తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2016లో టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు.


Next Story
Share it