ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా జే షా కొనసాగేందుకు సిద్ధమయ్యారు. బుధవారం బాలిలో జరిగిన ఏసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆయన మరో ఏడాది అదే పదవిలో కొనసాగేందుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కార్యదర్శి అయిన షా, ACC చీఫ్‌గా తన రెండవ సారి రెండేళ్ల పదవీకాలంలో ఉన్నారు. షా పొడిగింపును శ్రీలంక క్రికెట్ (SLC) ప్రెసిడెంట్ షమ్మీ సిల్వా ప్రతిపాదించారు. ACC సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ నుండి జనవరి 2021లో ACC పగ్గాలను స్వీకరించారు షా.
గత రెండు పర్యాయాలుగా ఏసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జై షా, తాజాగా మూడోసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జై షా స్పందిస్తూ, ఆసియా క్రికెట్ మండలి సభ్యదేశాలన్నీ తన పట్ల మరోసారి నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసియా వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి ఏసీసీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.