ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన జయ్ షా.. బాధ్యతలు స్వీకరించేది మాత్రం అప్పుడే..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జయ్ షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు

By Medi Samrat  Published on  27 Aug 2024 9:02 PM IST
ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన జయ్ షా.. బాధ్యతలు స్వీకరించేది మాత్రం అప్పుడే..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జయ్ షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అక్టోబర్ 2019 నుంచి బీసీసీఐ వ్యవహారాలను నిర్వహిస్తున్న జే షా డిసెంబర్ 1న‌ ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టనున్నారు. ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్ల్కే పదవీకాలం నవంబర్ 30తో ముగుస్తుంది. ఆయ‌న‌ మూడవసారి ప‌ద‌విలో కొన‌సాగేందుకు నిరాక‌రించారు. ఐసీసీ ఛైర్మ‌న్ పదవి నామినేషన్‌కు చివరి తేదీ ఆగస్టు 27 కాగా.. జయ్ షా ఒక్క‌రే బ‌రిలో ఉన్నారు.

ICC ఛైర్మ‌న్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఏకైక అభ్యర్థి జే షా. దీంతో తదుపరి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన‌ ఐదో భారతీయుడిగా జే షా నిలిచారు. ఆయ‌న‌ కంటే ముందు.. జగ్‌మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ గతంలో ఐసీసీకి నాయకత్వం వహించిన భారతీయులు.

ICC ప్రెసిడెంట్ పదవికి ఎన్నికైన తర్వాత.. గ్లోబల్ రీచ్, క్రికెట్‌కు ప్రజాదరణను మరింత పెంచాలనే ఉద్దేశ్యాన్ని జే షా వ్యక్తం చేశాడు. ఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికైనందుకు నేను పొంగిపోయాను అని షా అన్నారు. గ్లోబల్ క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ICC సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి నేను కట్టుబడి ఉన్నాను. క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.

Next Story