నకిలీ అకౌంట్‌పై బుమ్రా భార్య ఫైర్‌..!

భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా భార్య సంజనా గణేశన్‌ తన పేరుతో ఉన్న నకిలీ సోషల్‌ మీడియా ఖాతాను బట్టబయలు చేసింది

By Medi Samrat  Published on  3 July 2024 2:49 PM IST
నకిలీ అకౌంట్‌పై బుమ్రా భార్య ఫైర్‌..!

భారత క్రికెట్‌ జట్టు స్టార్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా భార్య సంజనా గణేశన్‌ తన పేరుతో ఉన్న నకిలీ సోషల్‌ మీడియా ఖాతాను బట్టబయలు చేసింది. సంజన పేరు మీద ఉన్న ఫేక్ అకౌంట్‌లో.. ఆమె ఫొటోలు షేర్ అవుతున్నాయి. T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో గెలిచిన తర్వాత బుమ్రా, సంజనల ఫోటోలు నకిలీ ఖాతాలో షేర్ చేయబడ్డాయి.

ఆ ఫేక్ అకౌంట్‌పై.. సంజనా గణేశన్ అకౌంట్‌ను డిలీట్ చేయాలని కోరింది. వినియోగదారు అలా చేయకుంటే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని కూడా హెచ్చ‌రించింది. సంజనా ఫేక్ అకౌంట్‌ను గుర్తించి.. ఇది తన పేరిట సృష్టించిన నకిలీ ఖాతా అని వెల్లడించింది. ఈ విషయాన్ని ఆమె తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో తెలియజేసింది.

జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన తన X హ్యాండిల్‌లో.. హలో.. ఇది న‌కిలీ ఖాతా.. దొంగిలించబడిన కంటెంట్ అని రాసింది. నేను మీ అకౌంట్‌ను గుర్తించాను. దయచేసి దాన్ని తొలగించండి లేదా నేను చట్టపరమైన చర్య తీసుకోవలసి ఉంటుందని హెచ్చరించింది.

సంజనా గణేశన్ ICC ప్రెజెంటర్. T20 వరల్డ్ కప్ 2024 కోసం సంజన అమెరికా, వెస్టిండీస్‌కు వెళ్లింది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ గెలిచిన తర్వాత ఆమె భర్త బుమ్రాతో కలిసి వేడుకలు జరుపుకుంది. ఆ సమయంలో వారి కొడుకు కూడా వెంట ఉన్నాడు. విజయోత్సవ వేడుకల ఫోటోల‌ను ఆమె పేరుతో ఉన్న నకిలీ ఖాతాలో షేర్ చేశారు. దీనిపై సంజన చర్యలు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించింది.

Next Story