బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన సెలక్షన్ కమిటీ

2025లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది.

By Medi Samrat  Published on  31 Dec 2024 5:46 PM IST
బుమ్రాకు రెస్ట్ ఇచ్చిన సెలక్షన్ కమిటీ

2025లో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న వైట్‌బాల్ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. 2024 ఐసిసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయిన స్టార్ పేసర్ కు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.

జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు వన్డేల సిరీస్‌ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ఏడు రోజుల ముందు వన్డే సిరీస్ ముగియనుంది. దీంతో ఈ సిరీస్ లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నారు. సెలెక్షన్ సమావేశంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడుతారా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నద్ధమవ్వడానికి ఇద్దరు ఆటగాళ్లు మూడు ODIల్లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా భారత పేస్ అటాక్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. గాయం కారణంగా సిరీస్‌కు మహ్మద్ షమీ దూరమవ్వగా అనుభవం లేని పేస్ లైనప్ బాధ్యతను బుమ్రా భుజానికెత్తుకున్నాడు.

Next Story