సంగీత్‌లో స్టెప్పులేసిన బుమ్రా.. వీడియో వైరల్
Jasprit Bumrah Sanjana Ganesan shake a leg during sangeet ceremony. తాజాగా బుమ్రా- సంజన తమ సంగీత్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
By తోట వంశీ కుమార్ Published on
16 March 2021 10:30 AM GMT

భారత ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గోవాలో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహాం జరిగింది. కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లికి ముందు వరకు తమ బంధం గురించి ఎక్కడా బయటపడని ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి తరువాత తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెళ్లి ఫోటోలతో పాటు వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. తాజాగా బుమ్రా- సంజన తమ సంగీత్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను బుమ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
సంగీత్ కార్యక్రమంలో బుమ్రా-సంజనతో కలిసి స్టెప్పులు వేశాడు. ఈ వీడియో కన్నుల పండుగా ఉందంటూ యార్కర్ కింగ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం బుమ్రా పెళ్లి, సంగీత్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా పుణెకు చెందిన సంజనా గణేశన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆ తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించారు. అనంతరం స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా అవతారమెత్తారు.
Next Story