బుమ్రా బౌల్డ్ అయ్యింది ఆమెకే..!

Jasprit Bumrah Marries TV Presenter Sanjana Ganesan. బుమ్రాను బౌల్డ్ చేసిన అమ్మాయి స్పోర్ట్స్ ప్రెజెంటర్, మిస్ ఇండియా ఫైనలిస్ట్ సంజనా గణేశన్ యే..!

By Medi Samrat  Published on  15 March 2021 4:34 PM IST
Jasprit Bumrah Marries TV Presenter Sanjana Ganesan

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. బుమ్రా దక్షిణాది నటితో ప్రేమలో ఉన్నాడంటూ కొద్దిరోజుల కిందట ప్రచారం జరిగింది.. అయితే ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పేశారు. ఇక ఒక టీవీ ప్రెజెంటర్ ను పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వైరల్ అవ్వగా.. ఎట్టకేలకు అదే నిజమైంది. బుమ్రాను బౌల్డ్ చేసిన అమ్మాయి స్పోర్ట్స్ ప్రెజెంటర్, మిస్ ఇండియా ఫైనలిస్ట్ సంజనా గణేశన్ యే..!

జస్ప్రీత్ బుమ్రా మార్చి 15న సంజనా గణేశన్‌‌ను గోవాలో పెళ్లిచేసుకున్నాడు. ఈ వివాహానికి అతికొద్దిమంది సన్నిహితులు, బంధువుల మాత్రమే ఆహ్వానం లభించింది. కరోనా నేపథ్యంలో కేవలం 20 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం లభించింది. వివాహానికి ముందు జరిగే సంగీత్‌ తదితర కార్యక్రమాలు ఆదివారమే పూర్తయ్యాయి. ఈ ఈవెంట్ కు మొబైల్ ఫోన్స్ కూడా అనుమతి ఇవ్వలేదు. సదరు జంట అధికారికంగా ఫోటోలను విడుదల చేసింది. పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న బుమ్రా వివాహం చేసుకోబోతున్నాడనే కథనాలు వచ్చాయి.. చివరికి అదే నిజమైంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌కు అతను అందుబాటులో లేకపోయినా.. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరుగబోయే ఐపీఎల్ 2021 సీజన్‌కు మాత్రం అందుబాటులోకి రానున్నాడు.




Next Story