Bumrah Net Worth : వికెట్ల సంఖ్యతో పాటు పెరుగుతున్న బుమ్రా సంపద..!

డిసెంబర్ 6న‌ యార్కర్ కింగ్‌గా ప్రసిద్ధి చెందిన జస్ప్రీత్ బుమ్రా పుట్టినరోజు.

By Medi Samrat  Published on  6 Dec 2024 2:01 AM GMT
Bumrah Net Worth : వికెట్ల సంఖ్యతో పాటు పెరుగుతున్న బుమ్రా సంపద..!

డిసెంబర్ 6న‌ యార్కర్ కింగ్‌గా ప్రసిద్ధి చెందిన జస్ప్రీత్ బుమ్రా పుట్టినరోజు. బుమ్రా మైదానంలో, వెలుపల ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. బుమ్రాకు 31 ఏళ్లు వచ్చాయి. అతడి వికెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ అతడి సంపద కూడా పెరుగుతోంది.

ఇటీవల జస్ప్రీత్ బుమ్రా భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి పెర్త్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. జస్ప్రీత్ బుమ్రా మొత్తం 8 వికెట్లు తీశాడు. బుమ్హర్ 31వ పుట్టినరోజున అతడి నికర సంప‌ద‌ విలువ గురించి తెలుసుకుందాం.

2024 నాటికి జస్ప్రీత్ బుమ్రా నికర విలువ రూ.60 కోట్లు. ఇందులో బీసీసీఐ కాంట్రాక్టులు, మ్యాచ్ ఫీజులు, ప్రకటనలు, ఐపీఎల్‌ నుండి వచ్చే ఆదాయాలు కూడా ఉన్నాయి. బీసీసీఐ కాంట్రాక్ట్‌ ప్రకారం జస్ప్రీత్ బుమ్రాను ఏ+ గ్రేడ్‌లో చేర్చారు. ఏటా రూ.7 కోట్లు సంపాదిస్తున్నాడు. దీంతోపాటు టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.7 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు అందుకుంటాడు.

ఇటీవల IPL 2024 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ అతనిని 18 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. ఇది కాకుండా.. బుమ్రా ఒక ప్రకటనకు రూ. 1.5 నుండి 2 కోట్లు వసూలు చేస్తాడు. Dream11, Asics, OnePlus Wearables, Juggle, Boat, Seagram's Royal Stag, CultSport, Astrolo, Unix, BharatPe వంటి బ్రాండ్‌లకు బుమ్రా అంబాసిడ‌ర్‌గా ఉన్నాడు.

బుమ్రాకు ముంబై (రూ. 2 కోట్లు), అహ్మదాబాద్ (రూ. 3 కోట్లు)లో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. అతనికి కార్ల సేకరణ హాబీ. ఇందులో మెర్సిడెస్ మేబ్యాక్ S560, నిస్సాన్ GT-R, రేంజ్ రోవర్ వెలార్, టయోటా ఇన్నోవా క్రిస్టా, హ్యుందాయ్ వెర్నా ఉన్నాయి.

జస్ప్రీత్ బుమ్రా తక్కువ సమయంలోనే భారత్‌కు గొప్ప విజయాలు అందించాడు. భారత్ తరఫున బుమ్రా 41 టెస్టుల్లో 181 వికెట్లు, 89 వన్డేల్లో 149 వికెట్లు, 70 టీ20ల్లో 89 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా మొత్తం 419 వికెట్లు తీశాడు. ఇటీవలి ప్రదర్శనను చూస్తుంటే, బుమ్రా త్వరలోనే 500 వికెట్ల ఘ‌న‌త సాధించ‌నున్నాడు.

Next Story