ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మరోమార్పు చేసింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ స్థానంలో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. మిచెల్ మార్ష్.. బయో బబుల్‌లో తాను ఎక్కువ రోజులు ఉండలేనంటూ 2021 ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో మిచెల్ మార్ష్ స్థానంలో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్‌ను జట్టులోకి తీసుకుంది సన్‌రైజర్స్.
మిచెల్ మార్ష్ రాబోయే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడని.. అతని స్థానంలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జేసన్ రాయ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒప్పందం చేసుకుందని ఐపీఎల్ ట్విటర్ పేజీలో పేర్కొంది. ఇదిలావుంటే.. జేసన్ రాయ్ ఐపీఎల్-2017లో గుజరాత్ లయన్స్‌కు ఆడాడు. ఆ తర్వాతి సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.అనంతరం 2020 సీజన్‌కు దూరంగా ఉన్నాడు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో జేసన్ రాయ్‌ను తీసుకునేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. తాజాగా సన్‌రైజర్స్ తీసుకుంది.