ఇక్క‌డ ఏం జ‌రిగిందో కాస్త చెబుతారా..? వీడియో వైర‌ల్‌

Jake Weatherald bizarre dismal two times for a single delivery. ఓ బ్యాట్స్‌మెన్ ఒకే బంతికి రెండు సార్లు అవుట్ అయ్యాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jan 2021 11:18 AM GMT
Jake Weatherald bizarre dismal two times for a single delivery

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు అద్భుత విన్యాసాలు జ‌రుగుతుంటాయి. బ్యాట్స్‌మెన్లు సిక్స‌ర్ల‌తోనే, ఫీల్డ‌ర్లు సూప‌ర్ ఫీల్డింగ్‌తోనో ఆక‌ట్టుకుంటుంటారు. అయితే.. ఆస్ట్రేలియాలో ప్ర‌స్తుతం బిగ్‌బాష్‌లీగ్ (బీబీఎల్‌) లీగ్ న‌డుస్తోంది. ఇందులో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న జ‌రిగింది. ఇలా జ‌రుగుతుంద‌ని క‌ల‌లో కూడా మ‌నం ఊహించ‌లేము. ఓ బ్యాట్స్‌మెన్ ఒకే బంతికి రెండు సార్లు అవుట్ అయ్యాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. రెండు వైపుల‌ కూడా ర‌నౌట్ అయ్యాడు. ఈ ఘ‌ట‌న అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, సిడ్నీ థండర్స్‌ జట్ల మ‌ధ్య ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో చోటుచేసుకుంది.


వివ‌రాల్లోకి వెళితే.. ఆదివారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌, సిడ్నీ థండర్స్‌ జట్ల మ‌ధ్య ఆదివారం మ్యాచ్ జ‌రిగింది. అడిలైడ్ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ ఆడ‌గా.. జేక్ వెద‌రాల్డ్‌(31) అనే బ్యాట్స్‌మెన్ ఒకే బంతికి రెండుసార్లు ర‌నౌట‌య్యాడు. మ్యాచ్‌ 10వ ఓవర్లో క్రిస్‌గ్రీన్‌ వేసిన బంతిని బ్యాటింగ్‌ చేస్తున్న ఫిలిప్‌ సాల్ట్‌ నేరుగా బౌలర్‌వైపే షాట్ ఆడాడు. అదే స‌మ‌యంలో నాన్‌స్ట్రైక‌ర్ ఎండ్‌లో ఉన్న జేక్ క్రీజుదాటి ముందుకు వ‌చ్చాడు. అప్ప‌టికే ఆ బంతి బౌల‌ర్ చేతికి తాకుతూ వికెట్ల‌ను కొట్టేసింది. అస‌లేం జ‌రిగిందో అర్థంకాని జేక్ ఆ బంతిని చూస్తూ అక్క‌డే నిలిచిపోయాడు. ఈ లోపు షాట్ ఆడిన ఫిలిప్ సింగిల్ కోసం య‌త్నించాడు. ఆల‌స్యంగా స్పందించిన జేక్ కీప‌ర్ వైపు ప‌రుగెత్తాడు. ఆలోపే ఫీల్డ‌ర్ బంతిని అందుకుని కీప‌ర్‌కు విసిరాడు. వెంట‌నే కీప‌ర్ వికెట్ల‌ను గిరాటేశాడు. రీప్లేలో రెండు వైపులా జేక్ అవుటైనట్లు తేలింది. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో వికెట్లు పడే సమయంలో జేక్‌ క్రీజులో లేకపోవడంతో అతడు అవుటైనట్లు తేల్చారు. దానినే లెక్కలోకి తీసుకోవడంతో వికెట్ గ్రీన్‌కే ఖాతాలో చేరింది.

'ఇక్కడేం జరిగిందో కాస్త చెబుతారా..? జేక్ వెదరాల్డ్ రెండు వైపులా ఒకే బంతికి రెండు సార్లు అవుటయ్యాడు.' బిగ్‌బాగ్ లీగ్ ట్విట్ట‌ర్ ఖాతాలో పంచుకోగా.. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.


Next Story
Share it