ఆ సమయంలో మేం చనిపోయినట్లు అనిపించింది
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. తన కెరీర్‌లో భారత క్రికెట్ మొత్తం షాక్‌కు గురైన ఓ రోజును గుర్తు చేసుకున్నాడు.
By Medi Samrat
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. తన కెరీర్‌లో భారత క్రికెట్ మొత్తం షాక్‌కు గురైన ఓ రోజును గుర్తు చేసుకున్నాడు. ఇది భారత క్రికెట్‌లో చీకటి అధ్యాయంగా పేర్కొంటారు. ఆ రోజు మొత్తం టీమ్‌ని చూస్తే.. చనిపోయినట్లు అనిపించిందని ఇర్ఫాన్ చెప్పాడు.
2007లో వెస్టిండీస్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించినప్పుడు, మొత్తం జట్టు షాక్‌కు గురైందని ఇర్ఫాన్ పఠాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇర్ఫాన్‌కి ఇదే తొలి వన్డే ప్రపంచకప్. ఆ సమయంలో ఏం జరిగిందోనని అందరూ ఆశ్చర్యపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2003లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. 2007లో గంగూలీ కెప్టెన్సీలో జరగని పని.. ఈసారి రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో జరుగుతుందని(వరల్డ్ కప్ నెగ్గడం) అంతా భావించారు. అయితే భారత్ ఆశలు అడియాసలయ్యాయి. బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడి భారత్ ప్రపంచకప్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.
ఈ ప్రపంచకప్ గురించి లేకప్ లాలాంటాప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ మాట్లాడుతూ.. రెండు రోజులు మేము హోటల్‌లో ఉన్నాము.. ఆ సమయంలో మేం చనిపోయినట్లు అనిపించింది.. అందరూ అలాగే ఉన్నారు.. మేమంతా చాలా బాధపడ్డాము.. అందరూ షాక్ అయ్యారని వివరించాడు.
ఈ ఓటమి గాయం నుంచి భారత్‌కు కొన్ని నెలల తర్వాత ఉపశమనం లభించింది. 2007లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ టీమ్‌లో ఇర్ఫాన్ కూడా ఉన్నాడు. అయితే వన్డే ప్రపంచకప్ నుంచి త్వరగా ఔట్ అయినందుకు జట్టు, అభిమానులు ఇంకా బాధగానే ఉన్నారు.