టీ20 ప్రపంచ కప్‌తో ముడిప‌డివున్న 'ఇషాన్ కిషన్' పెళ్లి..!

బీహార్‌లోని పాట్నాకు చెందిన ఇషాన్ కిషన్ భార‌త జ‌ట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత తుఫాను ఇన్నింగ్సులు ఆడుతూ చర్చనీయాంశంగా మారాడు.

By -  Medi Samrat
Published on : 16 Feb 2026 6:25 PM IST

టీ20 ప్రపంచ కప్‌తో ముడిప‌డివున్న ఇషాన్ కిషన్ పెళ్లి..!

బీహార్‌లోని పాట్నాకు చెందిన ఇషాన్ కిషన్ భార‌త జ‌ట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత తుఫాను ఇన్నింగ్సులు ఆడుతూ చర్చనీయాంశంగా మారాడు. ప్ర‌స్తుతం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ఫోర్లు, సిక్సర్లు, డ్యాన్స్ స్టైల్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇషాన్ ఇన్నింగ్స్ లాగే అతని వివాహం గురించి చర్చలు కూడా తీవ్రమయ్యాయి. ఇటీవ‌ల ఇషాన్ కిషన్ తాత ఇషాన్ జైపూర్ మోడల్‌ను వివాహం చేసుకోవచ్చని సూచించాడు. అయితే, ఇషాన్ తండ్రి వివాహం కంటే అత‌డు ప్రపంచ కప్‌కు ప్రాధాన్యత ఇస్తాడ‌ని పేర్కొన్నాడు.

ఇషాన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే తన కొడుకుతో ఇంటి విషయాలను ఎక్కువగా చర్చిస్తానని, అతను బాగా ఆడుతున్నాడని అన్నారు. "పాకిస్తాన్‌పై అతను బ్యాటింగ్ చేయడం చూసి మా కుటుంబం మొత్తం గర్వంగా ఉంది. భారత విజయంలో ఇషాన్ పాత్ర పోషించడం చూడటం కంటే మాకు సంతోషకరమైనది మరొకటి లేదన్నారు.

జైపూర్ మోడల్ అదితి హుండేతో తన కొడుకు వివాహం గురించి అడిగినప్పుడు అతని తండ్రి (ప్రణవ్ కుమార్ పాండే) ఇషాన్ తాతగారు అలా సూచించారని చెప్పాడు. అతని తాత రామ్ అనుగ్రహ్ పాండే ఒక సాధారణ వ్యక్తి. ఆయ‌న మాట్లాడుతూ.. చాలా కష్టపడి జట్టులోకి తిరిగి వచ్చాడు. అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. ముందుగా, టీ20 ప్రపంచ కప్ భారతదేశానికి రానివ్వండి, ఆ తర్వాత పెళ్లి గురించి చర్చిద్దాం అన్నారు.

T20 ప్రపంచ కప్‌లో ఇషాన్ కిషన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను వికెట్ కీపింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ తన 77 పరుగుల ఇన్నింగ్సుతో పాకిస్తాన్‌పై విజయానికి మార్గం సుగమం చేశాడు. అతడి స్కోరులో 10 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇషాన్ 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తిలక్ వర్మతో కలిసి 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Next Story