టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్..!
Ishan Kishan reveals chat with Virat Kohli.సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు
By తోట వంశీ కుమార్ Published on 9 Oct 2021 2:25 PM ISTసన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి విమర్శకుల నోరు మూయించాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ 11 పోర్లు, 4 సిక్సర్లు బాది 84 పరుగులు చేశాడు. అంతక ముందు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 25 బంతుల్లోనే అర్థశతకం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగడం గమనార్హం. ఇక టీ20 ప్రపంచ కప్‌కు ఎంపికైన ఈ యువ ఆటగాడు భారత జట్టు తరుపున ఓపెనింగ్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇషాన్ కిషన్ స్వయంగా చెప్పాడు.
మ్యాచ్ అనంతరం మీడియాతో ఇషాన్ మాట్లాడుతూ.. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో తాను చాటింగ్ చేశానని.. తనను ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు సిద్దంగా ఉండమని కోహ్లీ చెప్పినట్లు ఇషాన్ తెలిపాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఎంతగానో సాయం చేశాడని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా తో పాటు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలిచారన్నాడు. ప్రస్తుతం నీవు నేర్చుకునే దశలోనే ఉన్నావని.. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రపంచకప్ టోర్నీలో వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ ప్రోత్సహించినట్లు ఇషాన్ చెప్పాడు.
అనంతరం టీ20 ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ.. టీ 20 ప్రపంచకప్‌కు ఓపెనర్‌గా నువ్వు ఎంపిక అయ్యావు. అందుకోసం సిద్దంగా ఉండు. ఏ సవాలునైనా ఎదుర్కొనే విధంగా పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని విరాట్ భాయ్ చెప్పాడని అన్నాడు. ఓపెనింగ్ చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకోచ్చాడు ఈ యువ వికెట్ కీపర్. ఇక యూఏఈలోనే అక్టోబర్ 17 నుంచి టీ 20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.