వరుణుడు అడ్డొచ్చినా.. భారత్‌దే విజయం
టీమిండియా ప్రస్తుతం ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. తొలి టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 6:48 AM ISTవరుణుడు అడ్డొచ్చినా.. భారత్‌దే విజయం
టీమిండియా ప్రస్తుతం ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. భారత్ జట్టులో అంతా యంగ్ ప్లేయర్సే ఉన్నారు. తొలి టీ20 మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. అయితే..బౌలర్లు సత్తా చాటడంతో చివరికి భారత జట్టునే విజయం వరించింది.
తొలి టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్ గెలిచింది. కెప్టెన్‌గా ఉన్న బుమ్రా దాదాపు 11 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గ్యాప్ వచ్చాక కూడా మంచి ప్రదర్శనను చూపించాడు. తొలుతు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 139/7 పరుగులు చేసింది. 140 పరుగుల చేధనలో గ్రౌండ్‌లోకి దిగిన టీమిండియా.. 47/2తో ఉన్న దశంలో వర్షంతో మ్యాచ్ ఆగిపోయింది. వాన ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియాను విజేతగా ప్రకటించారు. తొలి టీ20లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో నెగ్గింది
కెప్టెన్‌గా వ్యవహరించిన జస్‌ప్రీత్ బుమ్రా (2/24)తో రాణించాడు. రవి బిష్ణోయ్ (2/23), ప్రిసిద్ కృష్ణ (2/32)తో సత్తా చాటారు. మొదట ఐర్లాండ్ బ్యాటింగ్ చేసి 139/7 పరుగులు చేసింది. బారీ మెకార్తీ (51 నాటౌట్)గా నిలిచాడు. కర్టిస్ క్యాంఫర్ (39) రాణించాడు. చేదనకు దిగిన టీమిండియా 47 పరుగులకు 2 వికెట్లును కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (24), రుతురాజ్ (19 నాటౌట్)చేశారు. ఐర్లాండ్ బౌలర్ యంగ్ యశస్వి జైస్వాల్(24), తిలక్ వర్మ (0)ను వెంట వెంటనే ఔట్ చేశాడు. 6.5 ఓవర్లలో భారత్ 47/2తో నిలచింది. అప్పుడే వర్షం మొదలైంది. ఆ తర్వాత ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయీస్ పద్దతిలో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు. ఇక ఐర్లాండ్ టీ20తోనే ప్రిసిద్, రింకూ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు.
భారత స్టార్ ఫేసర్ అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా బ్రేక్ తర్వాత మళ్లీ వచ్చాడు. గతేడాది అంతా అతడు ఫిట్‌నెస్ సమస్యలతోనే సతమతం అయ్యాడు. వెన్ను గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాక అతను మ్యాచ్‌లకు దూరంగానే ఉన్నాడు. ఎట్టకేలకు కోలుకుని ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో కెప్టెన్‌గా తిరిగి రావడం.. మంచి ప్రదర్శనను కనబర్చాడు. తొలి ఒకర్లోనే రెండు వికెట్లను పడగొట్టాడు. రనప్, వేగం కొంచెం తగ్గించినా బౌలింగ్ మాత్రం సూపర్బ్‌గా వేశాడు. వన్డే ప్రపంచ కప్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో బూమ్రా మళ్లీ ఫామ్‌లోకి రావడం క్రికెట్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.