ఐపీఎల్ 2021 వేలం.. ఏ ఆట‌గాడిని ఏ జ‌ట్టు సొంతం చేసుకుందంటే..? అమ్ముడుపోని ఆటగాళ్లు ఎవ‌రు..? లిస్ట్ ఇదే..

IPL Auction 2021 Full list of players sold and unsold.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021 వేలంలో ఆట‌గాళ్ల పంట పండింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Feb 2021 3:39 AM GMT
IPL Auction 2021 Full list of players sold and unsold

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2021 వేలంలో ఆట‌గాళ్ల పంట పండింది. ఒక జ‌ట్టు విడిచిపెట్టిన ఆట‌గాడి కోసం మిగ‌తా జ‌ట్లు పోటిప‌డ్డాయి. ఫ‌లితంగా ఆ ఆట‌గాడు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాడు. భారీ రేటు ప‌లుకుతార‌నుకున్న ఆట‌గాళ్లకు నామమాత్ర‌పు ధ‌ర ద‌క్క‌గా.. కొత్త ఆట‌గాళ్లు కూడా అనూహ్య ధ‌ర ల‌భించింది. కొంద‌రు స్టార్ ఆట‌గాళ్ల‌ను ప్రాంచైజీలు ప‌ట్టించుకోలేదు. అన్ని ఫ్రాంచైజీలు బౌల‌ర్ల కోసం నువ్వా నేను అన్న‌ట్లు పోటికి దిగాయి. ద‌క్షిణాఫ్రికా ఆల్‌రౌండ‌ర్ క్రిస్ మోరిస్ రూ.16.25కోట్ల ధ‌ర‌తో కొత్త రికార్డు న‌మోదు చేశాడు. భార‌త ఆట‌గాళ్ల‌లో కృష్ణ‌ప్ప గౌత‌మ్ అత్య‌ధికంగా రూ.9.25కోట్లు ద‌క్కించుకున్నాడు.

ఏ ప్రాంచైజీ ఏ ఆట‌గాడిని తీసుకుందంటే..?

కోల్‌కతా నైట్‌రైడర్స్‌: షకీబ్‌ అల్‌ హసన్‌ (రూ.3.2 కోట్లు), హర్భజన్‌ (రూ.2 కోట్లు), బెన్‌ కటింగ్‌ (రూ.75 లక్షలు), కరుణ్‌ నాయర్‌ (రూ.50 లక్షలు), పవన్‌ నేగి (రూ.50 లక్షలు), వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ.20 లక్షలు), షెల్డన్‌ జాక్సన్‌ (రూ.20 లక్షలు), వైభవ్‌ అరోరా (రూ.20 లక్షలు)

ముంబై ఇండియన్స్‌: కౌల్టర్‌నైల్‌ (రూ.5 కోట్లు), ఆడమ్‌ మిల్నె (రూ.3.2 కోట్లు), పియూష్‌ చావ్లా (రూ.2.4 కోట్లు), నీషమ్‌ (రూ.50 లక్షలు), యుధ్‌వీర్‌ (రూ.20 లక్షలు), జాన్సన్‌ (రూ.20 లక్షలు), అర్జున్‌ తెందుల్కర్‌ (రూ.20 లక్షలు)

చెన్నై సూపర్‌ కింగ్స్‌: కృష్ణప్ప గౌతమ్‌ (రూ.9.25 కోట్లు), మొయిన్‌ అలీ (రూ.7 కోట్లు), పుజారా (రూ.50 లక్షలు), భగత్‌ వర్మ (రూ.20 లక్షలు), హరి నిశాంత్‌ (రూ.20 లక్షలు), హరిశంకర్‌ రెడ్డి (రూ.20 లక్షలు)

ఢిల్లీ క్యాపిటల్స్‌: టామ్‌ కరన్‌ (రూ.5.25 కోట్లు), స్మిత్‌ (రూ.2.2 కోట్లు), బిల్లింగ్స్‌ (రూ.2 కోట్లు), ఉమేశ్‌ (రూ.కోటి), రిపల్‌ పటేల్‌ (రూ.20 లక్షలు), విష్ణు వినోద్‌ (రూ.20 లక్షలు), లక్మన్‌ మెరివాలా (రూ.20 లక్షలు), సిద్ధార్థ్‌ (రూ.20 లక్షలు)

పంజాబ్‌ కింగ్స్‌: రిచర్డ్‌సన్‌ (రూ.14 కోట్లు), మెరెడిత్‌ (రూ.8 కోట్లు), షారుఖ్‌ ఖాన్‌ (రూ.5.25 కోట్లు), హెన్రిక్స్‌ (రూ.4.20 కోట్లు), మలన్‌ (రూ.1.50 కోట్లు) ఫాబియాన్‌ అలెన్‌ (రూ.75 లక్షలు), జలజ్‌ సక్సేనా (రూ.30 లక్షలు), సౌరభ్‌ కుమార్‌ (రూ.20 లక్షలు), ఉత్కర్ష్‌ (రూ.20 లక్షలు)

రాజస్థాన్‌ రాయల్స్‌: మోరిస్‌ (రూ.16.25 కోట్లు), శివమ్‌ దూబె (రూ.4.4 కోట్లు), చేతన్‌ సకారియా (రూ.1.2 కోట్లు), ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ (రూ.కోటి), లివింగ్‌స్టన్‌ (రూ.75 లక్షలు), కరియప్ప (రూ.20 లక్షలు), ఆకాశ్‌ సింగ్‌ (రూ.20 లక్షలు), కుల్‌దీప్‌ (రూ.20 లక్షలు),

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: జేమీసన్‌ (రూ.15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌ (రూ.14.25 కోట్లు), క్రిస్టియన్‌ (రూ.4.8 కోట్లు), సచిన్‌ బేబి (రూ.20 లక్షలు), రజత్‌ (రూ.20 లక్షలు), మహమ్మద్‌ అజహరుద్దీన్‌ (రూ.20 లక్షలు), ప్రభుదేశాయ్‌ (రూ.20 లక్షలు), కేఎస్‌ భరత్‌ (రూ.20 లక్షలు)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: కేదార్‌ జాదవ్‌ (రూ.2 కోట్లు), ముజీబ్‌ రెహమాన్‌ (రూ.1.50 కోట్లు), సుచిత్‌ (రూ.30 లక్షలు)

అయితే కొంతమంది స్టార్ క్రికెటర్లకు ఈసారి నిరాశే ఎదురైంది. ఒకసారి ఆ జాబితాపై లుక్కెద్దాం.

అమ్ముడు పోని స్టార్ ఆటగాళ్లు..

1. అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్)

2. జాసన్ రాయ్ (ఇంగ్లండ్)

3. ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్)

4. ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)

5. హనుమ విహారీ(భారత్)

6. అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలియా)

7.షెల్డన్ కాట్రెల్ (వెస్టిండీస్)

8. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్)

9. డారెన్ బ్రావో(వెస్టిండీస్)

10. కోరె అండర్సన్(న్యూజిలాండ్)

11. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)

12. వరుణ్ ఆరోన్ (భారత్)

13. మోహిత్ శర్మ(భారత్)

14. మిచెల్ మెక్లీన్‌గన్ (న్యూజిలాండ్)

15. జాసన్ బెహ్రెన్‌డాఫ్ (ఆస్ట్రేలియా)

16. మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా)




Next Story