ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆ జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆఖరి 10 ఓవర్లు బెంగళూరు బౌలర్లు అద్భుతంగా కట్టడి చేస్తూ వచ్చారు. అయితే మ్యాచ్ గతిని పూర్తిగా మార్చిన క్షణం గురించి కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే స్పందించారు.
"13వ ఓవర్ వరకు మంచి పొజిషన్ లోనే ఉన్నామని నేను అనుకున్నాను, కానీ 2-3 వికెట్లు ఆట తీరును మార్చాయి. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు తమ శాయశక్తులా ప్రయత్నించారు కానీ సరైన ఫలితాలు రాలేదు. వెంకీ, నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, 200-210 సాధించవచ్చని మేము చర్చించుకున్నాము, కానీ వరుసగా వికెట్లు పడడం తమ గతిని మార్చాయి" అని రహానే మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్‌లో చెప్పాడు.
"కొంచెం మంచు కురిసింది, కానీ బెంగళూరు జట్టు బ్యాట్‌తో చాలా మంచి పవర్‌ప్లే స్కోరు చేశారు. మేము ఇక ఎక్కువగా ఆలోచించడం లేదు, కానీ అదే సమయంలో కొన్ని రంగాలలో మెరుగ్గా ఉండటానికి రాబోయే మ్యాచ్ లలో ప్రయత్నిస్తాం" అని రహానే అన్నారు.