రూ. 2 కోట్ల బేస్ ధరతో వేలంలో దిగే ఆటగాళ్లు వీళ్లే!!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం మొత్తం 1165 మంది భారతీయ ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.
By అంజి Published on 6 Nov 2024 1:45 PM ISTరూ. 2 కోట్ల బేస్ ధరతో వేలంలో దిగే ఆటగాళ్లు వీళ్లే!!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం కోసం మొత్తం 1165 మంది భారతీయ ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. నవంబర్ 24- 25 తేదీల్లో జెడ్డాలో 1574 మంది ఆటగాళ్లు వేలంపాటలో పాల్గొనబోతున్నారు. 1165 మంది భారత ఆటగాళ్లలో 23 మంది భారతీయ ఆటగాళ్లు అత్యధికంగా రూ. 2 కోట్ల లిస్టులో ఉన్నారు. 2024 సీజన్ తర్వాత విడుదలైన IPL కెప్టెన్లు రిషబ్ పంత్, KL రాహుల్, 2024 టైటిల్ విన్నర్ శ్రేయాస్ అయ్యర్ రూ. 2 కోట్ల కేటగిరీలో ఉండనున్నారు.
రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంపాటలో ఉన్న భారత ఆటగాళ్లు
ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, అవేష్ ఖాన్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ , మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్, KL రాహుల్, మహ్మద్ షమీ.
రూ. 2 కోట్ల బేస్ ధర ఉన్న భారత బ్యాటర్లు - శ్రేయాస్ అయ్యర్ మరియు దేవదత్ పడిక్కల్.
రూ. 2 కోట్ల బేస్ ధర ఉన్న భారత ఆల్ రౌండర్లు - వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, ఆర్ అశ్విన్.
రూ. 2 కోట్ల బేస్ ధర ఉన్న భారత వికెట్ కీపర్లు - రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్.
రూ. 2 కోట్ల బేస్ ధర ఉన్న భారత బౌలర్లు - ఖలీల్ అహ్మద్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, భువనేశ్వర్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, టి నటరాజన్, ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ .