ఐపీఎల్-2024 షెడ్యూల్‌పై చైర్మన్ కీలక ప్రకటన

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.

By Srikanth Gundamalla  Published on  20 Feb 2024 4:00 PM GMT
ipl-2024,  two schedules,  ipl chairman,

ఐపీఎల్-2024 షెడ్యూల్‌పై చైర్మన్ కీలక ప్రకటన

ఇండియాలో క్రికెట్‌కు చాలా మంది అభిమానులు ఉంటారు. ముఖ్యంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఉండే ఆదరణే వేరు. ఐపీఎల్‌ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన టీ20 లీగ్‌ ఇది. అయితే.. ఐపీఎల్-2024 లీగ్‌ షెడ్యూల్‌ ఎప్పటి నుంచి ఉంటుందనే దానిపై ప్రేక్షకుల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభ తేదీ తో పాటు నిర్వహణ, మ్యాచ్‌ల షెడ్యూల్‌ ప్రకటన విషయాలపై ఐపీఎల్ చైర్మన్ అరుణ్‌ ధుమాల్‌ పలు విషయాలను పంచుకున్నారు.

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. న్యూస్‌ ఏజెన్సీ పీటీఐతో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. చెన్నైలో తొలి మ్యాచ్‌ జరుగుతుందని చెప్పారు. మార్చి 22వ తేదీన టోర్నమెంట్‌ ప్రారంభించాలని చూస్తున్నామని అరుణ్ ధుమాల్ చెప్పారు. ప్రభుత్వం, ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక త్వరలోనే ప్రాథమిక షెడ్యూల్ కూడా ఇస్తామని వెల్లడించారు. అయితే.. ఐపీఎల్-2024 సీజన్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ ఈసారి రెండు దశలుగా ప్రకటించనుందని తెలుస్తోంది. ముందుగా 15 రోజులకు చెందిన మ్యాచ్‌ల తేదీలు.. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి ఐపీఎల్ మ్యాచ్‌ల తేదీలను నిర్ణయిస్తామని ధుమాల్ చెప్పారు.

ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ రెండు భాగాలుగా ఉంటుందని స్పష్టమైంది. మార్చి మొదటివారంలోనే తొలిదశ షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఐపీఎల్-2024 టోర్నీలో తొలి మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో జరగనుంది. గతేడాది టైటిల్‌ విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌, రన్నరప్‌ గుజరాత్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. మరోవైపు ఇప్పటి వరకు అత్యంత సక్సెస్‌ఫుట్‌ టీమ్‌గా ఉన్న ముంబై ఇండియన్స్‌ ఐదు టైటిళ్లను సాధించింది. ఈ రికార్డును గతేడాది టైటిల్‌ గెలిచి చెన్నై సూపర్‌కింగ్స్ సమం చేసిన విషయం తెలిసిందే.

Next Story