IPL-2024: ఆర్సీబీకి మరో షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం..!
ఐపీఎల్ మ్యాచ్‌లు సందడిగా కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 April 2024 1:19 PM ISTIPL-2024: ఆర్సీబీకి మరో షాక్.. స్టార్ ప్లేయర్‌కు గాయం..!
ఐపీఎల్ మ్యాచ్‌లు సందడిగా కొనసాగుతున్నాయి. తమ ఇష్టమైన టీమ్‌లను సపోర్ట్ చేసేందుకు ఫ్యాన్స్ స్టేడియానికి వస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో కూడా ఆర్‌సీబీ టీమ్‌కు వరుస ఓటములు తప్పడం లేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే.. సతమతం అవుతోన్న ఈ టీమ్‌కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు గాయం అయినట్లు సమాచారం. ముంబై ఇండియన్స్‌తో ఏప్రిల్ 11న ఆర్‌సీబీ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ చేతి బొటనవేలుకి గాయమైనట్లు తెలుస్తోంది.
చేతి వేలుకి గాయం కావడంతో మ్యాక్స్‌వెల్ నెక్ట్స్ మ్యాచ్ ఆడటం అనుమానమే అని పలువురు అంటున్నారు. ఆర్‌సీబీ టీమ్ తన తదుపరి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 15న చినస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మ్యాక్స్‌వెల్ లేకపోతే వరుస ఓటములు ఎదుర్కొంటున్న ఆర్‌సీబీకి మరిన్ని కష్టాలు ఎదురవనున్నాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో కేవలం ఒకే మ్యాచ్‌లో గెలిచింది. ఇక ఆర్‌సీబీ ప్లేయర్‌లో విరాట్ కోహ్లీ మాత్రమే కంటిన్యూగా పరుగులు సాధిస్తున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త బౌలింగ్ టీమ్‌గా ఉందని పలువురు కామెంట్ చేస్తున్నార.
మరోవైపు మ్యాక్స్‌వెల్ ఈ సీజన్‌లో అస్సలు రాణించలేకపోతున్నాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన అతను కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు డకౌట్లు కూడా ఉన్నాయి. అయితే.. మ్యాక్స్‌వెల్ ఫామ్‌లోకి వచ్చి ఆడితే మాత్రం మరో లెవల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికే ఐదు మ్యాచ్‌లు కోల్పోవడంతో ఆ జట్టు తీవ్ర కష్టాల్లో ఉంది.