IPL-2024: రికార్డును క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు.
By Srikanth Gundamalla Published on 7 April 2024 3:38 PM ISTIPL-2024: రికార్డును క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
ఐపీఎల్ 2024 సీజన్ సందడిగా కొనసాగుతోంది. ఐపీఎల్ సీజన్ 2024ను క్రికెట్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. అయితే.. కొన్ని టీమ్‌లకు మాత్రం అదృష్టం ఇంకా కలిసి రాలేదు. అద్బుత ఆటగాళ్లు ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఇంకా ఒక్క విజయం కూడా దక్కలేదు. ఇక ఆర్‌సీబీ కూడా నాలుగు మ్యాచ్‌లు ఆడితే ఒకే మ్యాచ్‌లో గెలిచింది. అయితే.. ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోయింది. అయితే.. ఈ మ్యాచ్ సందర్భంగా రియాన్ పరాగ్ క్యాచ్‌ను పట్టడం ద్వారా విరాట్ కోహ్లీ చరిత్రను సృష్టించాడు. ఈ క్యాచ్‌తో విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్ కీపర్ ఫీల్డర్‌గా రికార్డును క్రియేట్ చేశాడు. ఈ రికార్డును సాధించే క్రమంలో విరాట్ కోహ్లీ.. మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా రికార్డును బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో సురేశ్ రైనా 205 మ్యాచుల్లో 109 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక విరాట్ కోహ్లీ 242 మ్యాచ్‌లు ఆడి 110 క్యాచ్‌లు పట్టాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ, రైనా తర్వాత అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఘనత కీరన్ పోలార్డ్‌పేరు పై ఉంది. పోలార్డ్ 189 మ్యాచుల్లో 103 క్యాచ్‌లు పట్టాడు. వీరి తర్వాత రోహిత్ శర్మ (99), శిఖర్ ధావన్ (98) ఉన్నారు.
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా మరో ఘనత కూడా అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు (8) చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు. ముందు వరుసలో గేల్ 22, బాబర్ ఆజమ్ 11 సెంచరీలతో ఉన్నారు. ఐపీఎల్‌లో అత్యధికంగా 8 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డును విరాట్ కోహ్లీ మరింత మెరుగు పర్చుకున్నాడు.