IPL-2024: క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు! ఒకవేళ రద్దయితే..?
ఐపీఎల్-2024 సీజన్ తుది దశకు చేరింది. మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఈ లీగ్‌లో మిగిలి ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 23 May 2024 11:44 AM GMTIPL-2024: క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు! ఒకవేళ రద్దయితే..?
ఐపీఎల్-2024 సీజన్ తుది దశకు చేరింది. మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఈ లీగ్‌లో మిగిలి ఉన్నాయి. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కేకేఆర్‌తో ఆడి ఓడిన హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. శుక్రవారం వేదికగా ఈ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రెండు టీమ్‌లు అమీతుమీ తేల్చుకోబుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ ఫైనల్‌లో కేకేఆర్‌తో తలపడనుంది. కాగా.. క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఎలాగైనా హైదరాబాద్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో వర్షాలు పడుతున్నాయి. చెన్నై నగరంతో పాటు 7 జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెండ్రోజుల పాటు మే 23, 24 తేదీల్లో అతిభారీ వర్షాలు పడతాయని చెప్పారు. వర్షాలు పడనున్న నేపథ్యంలో క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న ఆందోళన అభిమానుల్లో మొదలైంది. క్వాలిఫయర్ మ్యాచ్ రద్దు అయితే ఏంటి పరిస్థితని అనుకుంటున్నారు. మరోవైపు ఫైనల్ మ్యాచ్‌కూడా ఇక్కడే జరగాల్సి ఉంది. ఆ రోజు కూడా వర్షం పడితే ఎలా అనుకుంటున్నారు క్రికెట్ అభిమానులు.
క్వాలిఫయర్-2 మ్యాచ్ రద్దయితే?
క్వాలిఫయర్-2 మ్యాచ్‌కి రిజర్వ్‌డే ఉందని ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు చెప్పారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ శుక్రవారం రద్దు అయితే.. రిజర్వ్‌డే అయిన మరుసటి రోజే శనివారం ఆటను కొనసాగిస్తారు. క్వాలిఫయర్-2తో పాటు ఫైనల్ మ్యాచ్‌కి కూడా రిజర్వ్ డేను కేటాయించారు. క్వాలిఫయర్ మ్యాచ్ రిజర్వ్‌డే కూడా ఫలితం తేలకపోతే పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉన్న జట్టు ఫైనల్ చేరుతుంది. అలా చూస్తే ఫైనల్‌కు టాప్-2లో ఉన్న సన్‌రైజర్స్ వెళ్తుంది. కేకేఆర్‌తో తలపడుతుంది.
మరోవైపు ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రిజర్వ్‌డేన కూడా జరగకపోతే.. అప్పుడూ పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉన్న టీమ్‌ను విజేతగా ప్రకటిస్తారు. అంటే.. కేకేఆర్ కప్‌ను అందుకుంటుంది. కాగా.. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఏ సీజన్ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అవ్వలేదు. గతేడాది గుజరాత్, చెన్నై ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగితే.. రిజర్వ్‌డే రోజున కొనసాగించారు. అందులో సీఎస్కే విజయం సాధించి ఐదోసారి టైటిల్‌ను గెలిచింది.