అరుదైన ఘనత సాధించిన కేకేఆర్ ప్లేయర్ సునీల్ నరైన్
సునీల్ నరైన అరుదైన ఘనతను అందుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 12 May 2024 10:24 AM GMTఅరుదైన ఘనత సాధించిన కేకేఆర్ ప్లేయర్ సునీల్ నరైన్
శనివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో కోల్‌కలతా మ్యాచ్ ఆడింది. ఇందులో కోల్‌కోతా నైట్ రైడర్స్ టీమ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐపీఎల్-2024 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి టీమ్‌గా కేకేఆర్ నిలిచింది. కాగా.. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యార్ 21 బంతుల్లో 42 పరుగుల చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బుమ్రా, పీయూష్ చావ్లా చెరో రెండు వికెట్లు తీశారు.
158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. పెద్దగా రాణించలేదు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 40 పరుగులు చేశాడు. ఇక తిలక్ వర్మ 17 బంతుల్లో 32 పరుగులు సాధించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రసెల్, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు తీశారు. సునీల్ నరైన్ ఒక వికెట్ తీసి 21 పరుగులు సమర్పించుకున్నాడు.
ఫామ్‌లో ఆడుతూ.. స్కోర్‌ను పరుగులు పెట్టిస్తున్న ఇషాన్ కిషన్‌ను సునీల్ నరైన్ పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో.. ఈ సీజన్‌లో సునీల్ నరైన్ 15వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే సునీల్ నరైన అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్ సీజన్‌లో 400కు పైగా పరుగులతో పాటు 15 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. నరైన్ కంటే ముందే ఈ ఘనతను సాధించిన వారిలో షేన్ వాట్సన్, జాక్వెస్ కలిస్ ఉన్నారు.
రాజస్థాన్ రాయల్స్ తరఫున 2008లో వాట్సన్ 472 పరుగులు చేసి.. 17 వికెట్లు తీసుకున్నాడు. ఇక 2012 సీజన్‌లో కేకేఆర్ తరఫున ఆడిన జాక్వెస్ కలిస్ 409 పరుగులు చేసి 15 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో మోస్ట్ ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌గా సునీల్ నరైన్ ఉన్నాడు. ఓపెనర్‌గా వస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. మరోవైపు బౌలింగ్‌లో కూడా రాణిస్తున్నాడు. 2024 సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన సునీల్ నరైన్.. 38 సగటుతో 461 పరుగులు చేశాడు. అలాగే ఇప్పటికే 15 వికెట్లు తీశాడు.
ముంబైతో మ్యాచ్ సందర్భంగా సునీల్ నరైన్ మరో ఘనతను కూడా సాధించాడు. మెన్స్ టీ20 క్రికెట్‌లో 550 వికెట్ల మైలురాయిని అందుకున్న మూడో బౌలర్‌గా నిలిచాడు. నరైన్ కంటే ముందు డ్వేన్ బ్రావో (325), రషీద్ ఖాన్ (574) వికెట్లతో ముందు స్థానాల్లో ఉన్నారు.