ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌ వల్ల అందరిలోనూ ఆందోళన ఉంది: రిషబ్ పంత్

ఐపీఎల్ 2024 సీజన్‌ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  28 April 2024 5:43 AM GMT
ipl-2024, delhi capitals, rishabh pant,

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌ వల్ల అందరిలోనూ ఆందోళన ఉంది: రిషబ్ పంత్

ఐపీఎల్ 2024 సీజన్‌ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఆయా టీమ్‌ల అభిమానులు ఎంతో ఎక్సైజ్ అవుతూ మ్యాచ్‌లను చూస్తున్నారు. అయితే.. శనివారం అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ తర్వాత రిషబ్‌ పంత్‌ మాట్లాడారు.

ఈ సందర్భంగా పలు కీలక కామెంట్స్ చేశాడు రిషబ్ పంత్. ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌ వల్ల అందరి మనసులోనూ ఆందోళన ఉందని రిషబ్ అన్నాడు. ప్రతి రోజూ ఓ గండమే అని ఢిల్లీ కెప్టెన్ అన్నాడు. టిమ్ డేవిడ్ లాంటి హార్డ్ హిట్టర్ క్రీజులోకి వచ్చాక పరిస్థితులు వేగంగా మారిపోతాయని అన్నాడు. అయితే.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయనీ.. ఒక్కో మ్యాచ్‌ను గెలుస్తూ ముందుకు సాగుతామని రిషబ్ పంత్ చెప్పాడు.

ముంబైతో మ్యాచ్‌ సందర్భంగా స్కోరు బోర్డుపై 250కి పైగా స్కోరు ఉండటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని రిషబ్ అన్నాడు. కానీ ఇంపాక్ట్‌ సబ్‌స్టిట్యూట్‌ వల్ల అందరి మనసులో ఆందోళన ఉందని చెప్పాడు. ప్రతిరోజూ ఒక గండమే అని వ్యాఖ్యానించాడ. అలాంటి సందర్భాల్లోనే బౌలర్లలో నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ చెప్పాడు. టిమ్ డేవిడ్ వంటి హార్డ్‌ హిట్టర్‌ క్రీజులో అడుగుపెట్టాక పరిస్థితులు వేగంగా మారాయన్నాడు. తమ ఓపెనర్ ఫ్రేజర్ తొలిరోజు నుంచి వచ్చిన అవకాశాలను అన్నింటినీ సద్వినియోగం చేసుకుంటున్నాడని రిషబ్ చెప్పాడు. గేమ్‌లో కూడా మెరుగ్గా రాణిస్తున్నాడని అన్నాడు. తమకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయనీ.. ఆ విధంగా వరుస గెలుపులతో ముందుకు సాగుతామని కెప్టెన్ రిషబ్ పంత్ అన్నాడు.

Next Story