ఐపీఎల్-2024 కోసం ధోనీ ప్రాక్టీస్.. సిక్సర్ల వర్షం (వీడియో)
ఐపీఎల్ సీజన్-2024 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 10 March 2024 2:45 AM GMTఐపీఎల్-2024 కోసం ధోనీ ప్రాక్టీస్.. సిక్సర్ల వర్షం (వీడియో)
ఐపీఎల్ సీజన్-2024 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ జరిగినన్ని రోజులకు క్రికెట్ అభిమానలకు పండగ వాతావరణం ఉంటుంది. అయితే.. ఇప్పటికే ఐపీఎల్2024 తొలి షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి 22వ తేదీ నుంచి ఈ సీజన్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉంది. చెపాక్ వేదికగా 22వ తేదీన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సీఎస్కే తలపడనుంది. తొలి మ్యాచ్ కోసం మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నాడు.
చెపాక్ స్టేడియంలో మ్యాచ్ ఉన్న సందర్భంగా ధోనీ ఐపీఎల్ సీజన్‌కు సిద్ధం అవుతున్నాడు. ప్రాక్టీస్ నెట్‌లో దోనీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఎక్కువగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నెట్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు అంతా తలా ఈస్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ధోనీ పేరిట ఐపీఎల్‌లో మంచి రికార్డులు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన నాలుగో ఆటగాడిగా ధోనీ కొనసాగుతున్నాడు. మాహీ ఇప్పటి వరకు ఈ లీగ్‌లో 239 సిక్స్‌లు కొట్టాడు. అయితే.. అత్యధిక సిక్స్‌లు కొట్టిన కెప్టెన్ అయితే ధోనీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు.
ఎంఎస్ ధోనీ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నాననీ.. కొత్త పాత్రలో కనిపించనున్నట్లు చెప్పాడు.అయితే. అందరూ ఈసారి ధోనీ మెంటార్‌గా వ్యవహరిస్తారని అనుకున్నారు. కానీ.. తాజాగా ఆయన ప్రాక్టీస్ నెట్‌లో శ్రమించడం చూస్తుంటే.. ఓపెనర్‌గా దిగుతాడని అందరూ అంటున్నారు. ఇక ఎంఎస్ ధోనీ సీఎస్కే కెప్టెన్‌గా ఉంటూనే ఓపెనర్‌గా దిగితే ఆయన ఫ్యాన్స్‌కు పూనకాలే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
Let’s fill the comments section with ________ 🔥#WhistlePodu 🦁💛 @msdhoni pic.twitter.com/Kw2pvbdTjG
— Chennai Super Kings (@ChennaiIPL) March 9, 2024