తొలి రోజు అమ్ముడైంది వీరే.. ఏ ఫ్రాంచైజీ ఏ ఆట‌గాళ్లను ద‌క్కించుకుందో చూడండి

IPL 2022 Mega Auction Day 1 Complete List Of Players Sold.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022 మెగా వేలంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Feb 2022 3:28 AM GMT
తొలి రోజు అమ్ముడైంది వీరే.. ఏ ఫ్రాంచైజీ ఏ ఆట‌గాళ్లను ద‌క్కించుకుందో చూడండి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) 2022 మెగా వేలంలో తొలి రోజు(శ‌నివారం) 74 మంది ఆట‌గాళ్ల‌ను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. త‌మ‌కు కావాల్సిన ఆట‌గాళ్ల కోసం కోట్లను వెచ్చించేందుకు ఫ్రాంచైజీలు వెనుకాడ లేదు. కొన్ని ఫ్రాంచైజీలు వేలానికి విడిచిపెట్టిన పాత ఆట‌గాళ్ల‌ను ద‌క్కించుకోగా.. మ‌రికొన్ని ఫ్రాంచైజీలు కొత్త ఆట‌గాళ్ల కోసంపోటీ ప‌డ్డాయి. ఇక తొలి రోజు అత్య‌ధిక ధర ప‌లికిన ఆట‌గాడిగా ఇషాన్ కిష‌న్ నిలిచాడు. రూ.15.25 కోట్లకు ముంబై ఇండియన్స్ అతడిని దక్కించుకుంది.

తొలి రోజు అనంత‌రం ఏ ఏ జ‌ట్లు ఎవ‌రెవ‌రినీ తీసుకున్నాయో చూద్దాం..

ముంబై ఇండియన్స్

కొనుగోలు చేసిన ఆటగాళ్లు : ఇషాన్ కిషన్ (రూ. 15.25 కోట్లు), డెవోల్డ్ బ్రెవిస్ (రూ. 3 కోట్లు), మురుగన్ అశ్విన్ (1.6 కోట్లు), బాసిల్ థంపి(30 లక్షలు)

రిటైన్ చేసుకున్న‌ ఆటగాళ్లు : రోహిత్ శర్మ(రూ.16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా(రూ.12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), పొలార్డ్ (రూ.6 కోట్లు)

మిగిలిన మొత్తం : రూ.27.85 కోట్లు

చెన్నై సూపర్ కింగ్స్

కొనుగోలు చేసిన ఆటగాళ్లు : దీపక్ చాహ‌ర్ (రూ.14 కోట్లు), అంబటి రాయుడు (రూ. 6.75 కోట్లు),డ్వేన్ బ్రావో, (రూ. 4.40 కోట్లు), రాబిన్ ఉతప్ప (రూ.2 కోట్లు), కెఎమ్ ఆసిఫ్ (రూ.20 లక్షలు), తుషార్ దేశ్ పాండే (రూ.20లక్షలు)

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : రవీంద్ర జడేజా(రూ.16 కోట్లు), ఎంఎస్ ధోని(రూ.12 కోట్లు), మొయిన్ అలీ (రూ.8 కోట్లు), రీతురాజ్ గైక్వాడ్ (రూ.6 కోట్లు).

మిగిలిన మొత్తం : రూ.20.45 కోట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

కొనుగోలు చేసిన ఆటగాళ్లు : జోష్ హాజిల్‌వుజ్ (రూ.7.75 కోట్లు), వనిందు హసరంగా (రూ.10.75 కోట్లు), దినేష్ కార్తీక్ (రూ.5.50 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.10.75 కోట్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (రూ.7 కోట్లు), ఆకాష్ దీప్ (రూ.20 లక్షలు), అనుజ్ రావత్ (రూ.3.40కోట్లు), షాబాజ్ అహ్మద్ (రూ.4.40కోట్లు).

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : విరాట్ కోహ్లీ (రూ.15 కోట్లు), గ్లెన్ మాక్స్‌వెల్ (రూ.11 కోట్లు), మహ్మద్ సిరాజ్(రూ.7 కోట్లు)

మిగిలిన మొత్తం : 9.25 కోట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్

కొనుగోలు చేసిన ఆటగాళ్లు : శివమ్ మావి (రూ. 7.25 కోట్లు), నితీష్ రాణా (రూ. 8 కోట్లు), శ్రేయాస్ అయ్యర్ (రూ. 12.25 కోట్లు), పాట్ కమిన్స్ (రూ. 7.25 కోట్లు), షెల్డన్ జాక్సన్ (రూ.60 లక్షలు)

రిటైన్ చేసుకున్న‌ ఆటగాళ్లు : ఆండ్రీ రస్సెల్ (రూ.12 కోట్లు), వెంకటేష్ అయ్యర్ (రూ.8 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ.8 కోట్లు), సునీల్ నరైన్ (రూ.6 కోట్లు)

మిగిలిన మొత్తం : రూ. 12.65 కోట్లు

పంజాబ్ కింగ్స్

కొనుగోలు చేసిన ఆటగాళ్లు : ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ.60 లక్షలు), హర్‌ప్రీత్ బ్రార్ (రూ.3.80 కోట్లు), షారుఖ్ ఖాన్ (రూ.9 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.5.25 కోట్లు), జానీ బెయిర్‌స్టో (రూ.6.75 కోట్లు), శిఖర్ ధావన్ (రూ.8.25 కోట్లు), కగిసో రబడ (రూ.9.25 కోట్లు) కోట్లు) కోట్లు), ఇషాన్ పోరెల్ (రూ.25 లక్షలు),

రిటైన్ చేసుకున్న‌ ఆటగాళ్లు : మయాంక్ అగర్వాల్ (రూ.14 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్ (రూ.4 కోట్లు)

మిగిలిన మొత్తం : రూ.28.65 కోట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్

కొనుగోలు చేసిన ఆటగాళ్లు : అభిషేక్ శర్మ (రూ.6.50 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ.8.50 కోట్లు), ప్రియమ్ గార్గ్ (రూ.20 లక్షలు), భువనేశ్వర్ కుమార్ (రూ.4.20 కోట్లు), టి నటరాజన్ (రూ.4 కోట్లు), నికోలస్ పూరన్ (రూ.10.75 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ.8.75 కోట్లు), జగదీషా సుచిత్ (రూ.20 లక్షలు), శ్రేయాస్ గోపాల్ (రూ.75 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ.4 కోట్లు).

రిటైన్ చేసుకున్న‌ ఆటగాళ్లు : కేన్ విలియమ్సన్ (రూ.14 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ.4 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు)

మిగిలిన మొత్తం : రూ.20.15 కోట్లు

లక్నో సూపర్ జెయింట్స్

కొనుగోలు చేసిన ఆటగాళ్లు : మార్క్ వుడ్ (రూ.7.50 కోట్లు), కృనాల్ పాండ్యా (రూ.8.25 కోట్లు), దీపక్ హుడా (రూ.5.75 కోట్లు), జాసన్ హోల్డర్ (రూ.8.75 కోట్లు), మనీష్ పాండే (రూ.4.60 కోట్లు), అంకిత్ రాజ్‌పుత్ (రూ.50 లక్షలు), అవేష్ ఖాన్ (రూ.10కోట్లు )

రిటైన్ చేసుకున్న ఆట‌గాళ్లు : కేఎల్ రాహుల్ (రూ.15 కోట్లు), స్టోయినిస్ (రూ.11 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ.4 కోట్లు)

మిగిలిన మొత్తం : రూ.6.90 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్

కొనుగోలు చేసిన ఆటగాళ్లు : అశ్విన్ హిబ్బర్ (రూ.20 లక్షలు), డేవిడ్ వార్నర్ (రూ.6.25 కోట్లు), కమలేష్ నాగర్‌కోటి (రూ.1.10 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.20 లక్షలు), మిచెల్ మార్ష్ (రూ.6.50 కోట్లు), కుల్దీప్ యాదవ్ (రూ.2 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ.10.75 కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (రూ.2 కోట్లు), కేఎస్‌ భరత్ (రూ.2 కోట్లు), కమలేష్ నాగర్కోటి (రూ.1.10 కోట్లు)

రిటైన్ చేసుకున్న‌ ఆటగాళ్లు : అన్రిచ్ నార్జ్ (రూ.6.50 కోట్లు), అక్షర్ పటేల్ (రూ.9 కోట్లు), రిషబ్ పంత్ (రూ.16 కోట్లు), పృథ్వీ షా (రూ.7.50 కోట్లు)

మిగిలిన మొత్తం : రూ.16.50 కోట్లు

గుజరాత్ టైటాన్స్

కొనుగోలు చేసిన ఆటగాళ్లు : రాహుల్ తెవాటియా (రూ.9 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ.2.60 కోట్లు), లూకీ ఫెర్గూసన్ (రూ.10 కోట్లు), జాసన్ రాయ్ (రూ.2 కోట్లు), మహ్మద్ షమీ (రూ.6.25 కోట్లు), నూర్ అహ్మద్ (రూ.30 లక్షలు), ఆర్ సాయి కిషోర్(రూ.3కోట్లు)

రిటైన్ చేసుకున్న‌ ఆటగాళ్లు : హార్దిక్ పాండ్యా (రూ.15 కోట్లు), శుభ్‌మన్ గిల్ (రూ.7 కోట్లు), రషీద్ ఖాన్ (రూ.15 కోట్లు)

మిగిలిన మొత్తం : రూ.18.85 కోట్లు

రాజస్థాన్ రాయల్స్

కొనుగోలు చేసిన ఆటగాళ్లు : రియాన్ పరాగ్ (రూ.3.80 కోట్లు), యుజ్వేంద్ర చాహల్ (రూ.6.50 కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (రూ.10 కోట్లు), దేవదత్ పడికల్ (రూ.7.75 కోట్లు), షిమ్రాన్ హెట్మెయర్ (రూ.8.50 కోట్లు), ట్రెంట్ బౌల్ట్ (రూ.8 కోట్లు), ఆర్ అశ్విన్ (రూ.5 కోట్లు), కెసి కరియప్ప (రూ.30 లక్షలు)

రిటైన్ చేసుకున్న ఆట‌గాళ్లు : సంజు శాంసన్ (రూ.14 కోట్లు), జోస్ బట్లర్ (రూ.10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ.4 కోట్లు)

మిగిలిన మొత్తం : రూ.12.15 కోట్లు

Next Story