భారీ ధర పలికిన శ్రేయాస్ అయ్యర్.. వార్నర్‌కు మరీ అంత తక్కువ
IPL 2022 Auction Shreyas Iyer Sold To KKR For Rs 12.25 Crore.అందరి అంచనాలను నిజం చేస్తూ టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 12 Feb 2022 1:37 PM ISTఅందరి అంచనాలను నిజం చేస్తూ టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ భారీ ధర పలికాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.12.25 కోట్లు పెట్టి దక్కించుకుంది. ముఖ్యంగా శ్రేయాస్ కోసం ఢిల్లీ, గుజరాత్, కోల్‌కతా తీవ్రంగా పోటి పడ్డాయి. చివరకు శ్రేయాస్‌ను కేకేఆర్ సొంతం అయ్యాడు. కాగా.. గతేడాది శ్రేయాస్ రూ.7 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా కీలక పేసర్ మహ్మద్ షమిని గుజరాత్ టైటాన్స్ రూ.6.25కోట్లకు దక్కించుకుంది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడాను పంజాబ్ రూ. 9.25 కోట్లకు దక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డుప్లెసిస్‌ను కొనుగోలు చేసింది. క్వింటన్ డికాక్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.6.75కోట్లకు సొంతం చేసుకుంది. ఇక ఐపీఎల్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ ఈ సారి చాలా తక్కువ ధర పలికాడు. గతేడాది సన్‌రైజర్స్ రూ.12కోట్లకు తీసుకోగా.. ఈ సారి మెగా వేలంలో ఢిల్లీ రూ.6.25కోట్లకే దక్కించుకుంది.
టీమ్ఇండియా ఆటగాడు మనీశ్ పాండేను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.4.60 కోట్లకు దక్కించుకుంది. వెస్టిండీస్ స్టార్ హిట్టర్ హెట్‌మయర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.8.50 కోట్లకు కొనుగోలు చేసింది. రాబిన్ ఉతప్పను చైన్నై సూపర్ కింగ్స్ రూ.2 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ను రాజస్థాన్ రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.7.25 కోట్లకు దక్కించుకుంది. ఇక రవిచంద్రన్ అశ్విన్ రూ.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ , శిఖర్ ధావన్‌ను రూ.8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకున్నాయి.