రేప‌టి నుంచే ఐపీఎల్ రెండో అంచె పోటీలు.. షెడ్యూల్ ఇదే

IPL 2021 Second phase schedule.క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ ఏడాది మేలో అర్థాంత‌రంగా ఆగిపోయిన ఇండియ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sept 2021 3:29 PM IST
రేప‌టి నుంచే ఐపీఎల్ రెండో అంచె పోటీలు.. షెడ్యూల్ ఇదే

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ ఏడాది మేలో అర్థాంత‌రంగా ఆగిపోయిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్ )2021 సీజ‌న్ రేప‌టి నుంచి యూఏఈ వేదిక‌గా ప్రారంభం కానుంది. ప‌రిమిత సంఖ్య‌లో ప్రేక్ష‌కుల‌ను కూడా అనుమ‌తించ‌డంతో రెట్టింపు మ‌జా రావ‌డం ఖాయం. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే పోరుతో ఈ సీజ‌న్ రెండో అంచె పోటీలు ఆరంభం కానున్నాయి. ఫ‌స్టాప్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌‌, చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌, రాయల్ చాలెంజర్స్‌‌ బెంగళూరు టాప్ 3 ప్లేసులో ఉన్నాయి.

ముంబై ఇండియన్స్ ఆడ‌నున్న మ్యాచ్‌లు

సెప్టెంబర్ 19న‌ సీఎస్‌కే (దుబాయ్‌), సెప్టెంబర్ 23న‌ కేకేఆర్ (అబుదాబి), సెప్టెంబర్ 26న‌ ఆర్‌సీబీ (దుబాయ్‌), సెప్టెంబర్ 28న‌ పంజాబ్ కింగ్స్ (అబుదాబి) అక్టోబర్ 2న‌ ఢిల్లీ క్యాపిటల్స్ (షార్జా సాయంత్రం 3.30 గంటలు), అక్టోబర్ 5‌న‌ రాజస్తాన్‌ రాయల్స్‌‌( షార్జా), అక్టోబర్ 8న‌ ఎస్‌ఆర్‌హెచ్ ‌(అబుదాబి)

సీఎస్‌కే ఆడ‌నున్న మ్యాచ్‌లు

సెప్టెంబర్‌ 19‌న‌ ముంబై ఇండియన్స్ (దుబాయ్‌), సెప్టెంబర్ 24న‌ ఆర్‌సీబీ (షార్జా), సెప్టెంబర్‌ 26‌న‌ కేకేఆర్(అబుదాబి సాయంత్రం 3.30 గంటలు), సెప్టెంబర్‌ 30‌న‌ ఎస్‌ఆర్‌హెచ్‌(షార్జా), అక్టోబర్ 2‌న‌ రాజస్తాన్‌ రాయల్స్ (అబుదాబి), అక్టోబర్ 4‌న‌ ఢిల్లీ క్యాపిటల్స్ (దుబాయ్‌), అక్టోబర్ 7‌న‌ పంజాబ్‌ కింగ్స్ (దుబాయ్ సాయంత్రం 3.30 గంటలు)

ఆర్‌సీబీ ఆడ‌నున్న మ్యాచ్‌లు

సెప్టెంబర్ 20న‌ కేకేఆర్‌‌(అబుదాబి),సెప్టెంబర్ 24న‌ సీఎస్‌కే (షార్జా),సెప్టెంబర్‌ 26‌న‌ ముంబై ఇండియన్స్‌ (దుబాయ్‌), సెప్టెంబర్ 29న‌ రాజస్తాన్‌ రాయల్స్‌ (దుబాయ్‌ సాయంత్రం 3.30 గంటలు), అక్టోబర్ 3న‌ పంజాబ్‌ కింగ్స్‌ (షార్జా సాయంత్రం 3:30 గంటలు), అక్టోబర్ 6న‌ ఎస్‌ఆర్‌హెచ్ (అబుదాబి), అక్టోబర్ 8న‌ ఢిల్లీ క్యాపిటల్స్ (దుబాయ్‌)

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడ‌నున్న మ్యాచ్‌లు

సెప్టెంబర్ 22న‌ ‌ఎస్‌ఆర్‌హెచ్ (దుబాయ్‌),సెప్టెంబర్‌ 25‌న‌ రాజస్తాన్‌ రాయల్స్ (అబుదాబి సాయంత్రం 3:30 గంటలు), సెప్టెంబర్‌ 28‌న‌ కేకేఆర్ (షార్జా సాయంత్రం 3:30 గంటలు), అక్టోబర్ 2న‌ ముంబై ఇండియన్స్(షార్జా సాయంత్రం 3.30 గంటలు), అక్టోబర్ 4న‌ సీఎస్‌కే (దుబాయ్‌), ‌అ‍క్టోబర్ 8‌న‌ ఆర్‌సీబీ (దుబాయ్‌)

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆడ‌నున్న మ్యాచ్‌లు

సెప్టెంబర్ 20న‌ ఆర్‌సీబీ (అబుదాబి), సెప్టెంబర్ 23న‌ ముంబై ఇండియన్స్ (అబుదాబి), సెప్టెంబర్ 26న‌ సీఎస్‌కే (అబుదాబి సాయంత్రం 3:30 గంటలు),సెప్టెంబర్ 28న ఢిల్లీ క్యాపిటల్స్(షార్జా సాయంత్రం 3:30 గంటలు), అక్టోబర్ 1న‌ పంజాబ్‌ కింగ్స్‌ (దుబాయ్‌), అక్టోబర్ 3న‌ ఎస్‌ఆర్‌హెచ్ (దుబాయ్‌), అక్టోబర్ 7న రాజస్తాన్‌ రాయల్స్ (షార్జా)

పంజాబ్‌ కింగ్స్‌‌ ఆడ‌నున్న మ్యాచ్‌లు

సెప్టెంబర్ 21న‌ రాజస్తాన్‌ రాయల్స్ (దుబాయ్‌), సెప్టెంబర్ 25న‌ ఎస్‌ఆర్‌హెచ్ (షార్జా), సెప్టెంబర్ 28న‌ ముంబై ఇండియన్స్‌ (అబుదాబి), అక్టోబర్ 1న‌ కేకేఆర్ (దుబాయ్‌), అక్టోబర్ 3న‌ ఆర్‌సీబీ (షార్జా సాయంత్రం 3:30 గంటలు), అక్టోబర్ 7న‌ సీఎస్‌కే (దుబాయ్ సాయంత్రం 3:30 గంటలు)

ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడ‌నున్న మ్యాచ్‌లు

సెప్టెంబర్ 22న‌ ఢిల్లీ క్యాపిటల్స్ (దుబాయ్‌), సెప్టెంబర్ 25న‌ పంజాబ్‌ కింగ్స్‌ (షార్జా), సెప్టెంబర్ 27న రాజస్తాన్‌ రాయల్స్ (దుబాయ్‌),సెప్టెంబర్ 30న‌ సీఎస్‌కే (షార్జా), అక్టోబర్ 3న‌ కేకేఆర్ (దుబాయ్‌), అక్టోబర్ 6న‌ ఆర్‌సీబీ (అబుదాబి), అక్టోబర్ 8న‌ ముంబై ఇండియన్స్ (అబుదాబి సాయంత్రం 3:30 గంటలు)

రాజస్తాన్‌ రాయల్స్ ఆడ‌నున్న మ్యాచ్‌లు

సెప్టెంబర్ 21న‌ పంజాబ్‌ కింగ్స్ (దుబాయ్‌), సెప్టెంబర్ 25న‌ ఢిల్లీ క్యాపిటల్స్ (అబుదాబి సాయంత్రం 3:30 గంటలు), సెప్టెంబర్ 27న‌ ఎస్‌ఆర్‌హెచ్ (దుబాయ్‌),సెప్టెంబర్ 29న‌ ఆర్‌సీబీ( దుబాయ్‌), అక్టోబర్ 2న సీఎస్‌కే(అబుదాబి), అక్టోబర్ 5న‌ ముంబై ఇండియన్స్‌ (షార్జా), అక్టోబర్ 7న‌ కేకేఆర్ (షార్జా)


Next Story