ఏ జ‌ట్టులో ఏ ఆట‌గాళ్లు ఉన్నారు..? ఎవ‌రిని వ‌దులుకున్నారు..? జాబితా ఇదే..

IPL 2021 players retention and release team list.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)2021 కి సంబంధించి బీసీసీఐ ఆదేశాల మేరకు రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను అన్ని జ‌ట్లు ప్రకటించాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2021 1:30 PM IST
IPL team list
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)2021 కి సంబంధించి బీసీసీఐ(భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) ఆదేశాల మేరకు రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను అన్ని జ‌ట్లు ప్రకటించాయి. కొన్ని ఫ్రాంచైజీలు పేరున్న ఆట‌గాళ్ల‌ను వ‌దిలి వేసాయి. దీంతో వారంద‌రూ వేలంలో‌కి అందుబాటులోకి వ‌చ్చారు. ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో మినీ వేలం జ‌ర‌గ‌నుంది. యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్‌లో లీగ్ చ‌రిత్ర‌లోనే అత్యంత నిరాశ జ‌న‌క ప్ర‌ద‌ర్శ‌న‌తో నిష్ర్క‌మించింది చైన్నై సూప‌ర్ కింగ్స్ ఆజ‌ట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనాను అట్టి పెట్టుకుని.. సీనియ‌ర్ బౌల‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్‌ను వ‌దిలివేసింది. ఇక రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఏకంగా ఆ జ‌ట్టు కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ను వ‌దిలివేసింది. కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను యువ ఆట‌గాడు సంజూ శాంస‌న్‌కు ఇచ్చింది. ఏ టీమ్‌లో ఏ ఆట‌గాళ్లు ఉన్నారో ఓ సారి చూద్దాం.


సన్‌రైజర్స్ హైదరాబాద్ :

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : డేవిడ్ వార్నర్(కెప్టెన్), మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్ స్టో, వృద్దిమాన్ సాహా, శ్రీవాత్స్ గోస్వామి, ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, రషీద్ ఖాన్, నటరాజన్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమాద్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, బసిల్ థంపి, షాబాజ్ నదీమ్, సిద్దార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్

వదులుకున్న ఆటగాళ్లు : బిల్లీ స్టాన్​లేక్, ఫాబియాన్ అలెన్, ఎస్ యాదవ్, బావనక సందీప్, యర్ర పృథ్వీరాజ్

ముంబై ఇండియన్స్ :

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, ధావల్ కులకర్ణి, బుమ్రా, రాహుల్ చాహర్, బౌల్ట్, ఎం ఖాన్, హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్, పొలార్డ్, కృనాల్ పాండ్యా, అనుకూల్ రాయ్, ఇషాన్ కిషన్, డికాక్, ఆదిత్యా తారే.

వదులుకున్న ఆటగాళ్లు : మలింగ, కౌల్టర్​నీల్, ప్యాటిన్సన్, రూథర్​పొర్డ్, దిగ్విజయ్, ప్రిన్స్, మెక్​క్లెనగన్

చెన్నై సూపర్ కింగ్స్ :

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : ఎంఎస్ ధోనీ(కెప్టెన్), సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీషన్, ఫాఫ్ డూప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, సామ్ కరన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, జోష్ హజెల్ వుడ్, శార్దూల్ ఠాకూర్, కరన్ శర్మ, ఆసిఫ్, ఇమ్రాన్ తాహిర్, సాయి కిషోర్, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి

వదులుకున్న ఆటగాళ్లు : కేదార్ జాదవ్, షేన్ వాట్సన్(రిటైర్డ్), పియూష్ చావ్లా, మురళీ విజయ్, మోను కుమార్, హర్భజన్ సింగ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు:

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, ఆడమ్ జంపా, షెబాజ్ అహ్మద్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, పవన్ దేశ్‌పాండే

వదులుకున్న ఆటగాళ్లు : మోయిన్ అలీ, శివమ్ దూబే, గుర్‌క్రీత్ సింగ్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, పవన్ నేగి, పార్థీవ్ పటేల్(రిటైర్డ్), డేల్ స్టేయిన్, ఇసురు ఉడానా, ఉమేశ్ యాదవ్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : కేఎల్ రాహుల్(కెప్టెన్)​, గేల్​, పూరన్​, షమీ, జోర్డాన్​, మయాంక్​, మన్‌దీప్ సింగ్, బిష్ణోయ్​, ప్రభు సిమ్రాన్ సింగ్, దీపక్ హుడా, సర్ఫ్​రాజ్ ఖాన్​, అర్ష్​దీప్ సింగ్​, మురుగున్ అశ్విన్​, ఇషాన్ పోరెల్​, హర్​ప్రీత్ బ్రార్​

వదులుకున్న ఆటగాళ్లు : గ్లేన్ మ్యాక్స్ వెల్, షెల్డన్ కాట్రెల్, కృష్ణప్ప గౌతమ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జిమ్మీ నీషమ్, హర్దస్ విల్‌జోయిన్, కరుణ్ నాయర్

కోల్‌కతా నైట్‌రైడర్స్ :

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : ఇయాన్ మోర్గాన్(కెప్టెన్)​, దినేశ్ కార్తీక్, ఆండ్రూ రసెల్, గున్రే, నాగర్​కోటి, కుల్దీప్ యాదవ్, ఫెర్గుసన్, నితీశ్ రానా, పీ కృష్ణ, వారియర్, శివం మావి, శుభ్​మన్ గిల్, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ త్రిపాఠి

వదులుకున్న ఆటగాళ్లు : టామ్ బాంటన్, క్రిస్ గ్రీన్, నాయక్, లాడ్, సిద్దార్థ్

రాజస్థాన్ రాయల్స్ :

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : సంజూ శాంసన్ (కెప్టెన్), మనన్ వొహ్రా, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, రాబిన్ ఊతప్ప, అనుజ్ రావత్, బెన్ స్టోక్స్, రాహుల్ తెవాటియా, మహిపాల్ లోమ్‌రోర్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనాద్కత్, కార్తీక్ త్యాగీ, శ్రేయస్ గోపాల్, మయాంక్ మార్కండే

వదులుకున్న ఆటగాళ్లు : స్టీవ్ స్మిత్, అంకిత్ రాజ్‌పుత్, ఓషానే థామస్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్, అనిరుద్ జోషి, ఆకాశ్ సింగ్, శశాంక్ సింగ్,

ఢిల్లీ క్యాపిటల్స్ :

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు : శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ధావన్, రిషభ్ పంత్, ఇషాన్ శర్మ, అజింక్యా రహానె, రవి అశ్విన్, పృథ్వీ షా, లలిత్ యాదవ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, రబాడ, స్టోయినిస్, క్రిస్ వోక్స్, హెట్​మెయర్, ప్రవీణ్ దూబే

వదులుకున్న ఆటగాళ్లు : మోహిత్ శర్మ, సందీప్ లమిచానే, అలెక్స్ కారే, జాసన్ రాయ్, కే పాల్, హర్షల్ పటేల్ (ట్రేడెడ్), దేశ్​పాండే (ట్రేడెడ్)


Next Story