ఎంఎస్‌ ధోనీకి పాకిస్థాన్‌ నుంచి ఆహ్వానం.. ఎందుకంటే..

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్న్ మహేంద్ర సింగ్‌ ధోనీ ఆట తీరుకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

By Srikanth Gundamalla  Published on  30 Dec 2023 4:15 PM GMT
invitation,  MS Dhoni,  Pakistan,

ఎంఎస్‌ ధోనీకి పాకిస్థాన్‌ నుంచి ఆహ్వానం.. ఎందుకంటే.. 

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్న్ మహేంద్ర సింగ్‌ ధోనీ ఆట తీరుకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వరల్డ్‌ క్రికెట్‌లో ప్రస్తుతం ఆడకపోయినా ఐపీఎల్‌లో మాత్రం అందరినీ అలరిస్తున్నారు. గత సీజన్‌లో ధోనీ ఆటకోసమే స్టేడియాలకు వెళ్లినవారు ఉన్నారంటే నమ్మండి. ఆయన ఒక్క బంతికి బ్యాటింగ్ చేసినా చాలనుకున్నారు. అలాంటి క్రేజ్‌ ఉంది మాహీకి. అయితే.. మహేంద్ర సింగ్‌ ధోనీకి తాజాగా పాకిస్థాన్‌ నుంచి ఆహ్వానం అందింది. అసలు ఆ ఆహ్వానం ఎవరు పంపారు..? దేనికోసమో తెలుసుకోవాలనుందా..? అయితే.. ఈ స్టోరీ చదివేసేయండి.

ధోనీ తన క్రికెట్ కెరియర్‌లో ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. ఫినిషర్‌గా వస్తూ చాలా మ్యాచ్‌లను గెలిపించాడు. కెప్టెన్‌ కూల్‌గా ఉంటూ.. భారత్‌కు రెండు వరల్డ్‌ కప్‌లను అందించారు. మన మాహీ క్రికెట్‌ టోర్నీల కోసం టీమ్‌తో పాటు వివిధ దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అలాగే 2006-2008 మధ్య పాకిస్థాన్‌లో కూడా టూర్‌కు వెళ్లాడు. అలా వెళ్లినప్పుడు మాహీకి అక్కడ తిన్న భోజనం ఎంతో నచ్చిందట. అదే గుర్తు చేశాడు తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లండి అంటూ వీడియో ఓ వ్యక్తి సలహా ఇచ్చినట్లు కూడా రికార్డు అయ్యింది.

తాజాగా ఇదే వీడియోపై పాకిస్థాన్‌ స్పోర్ట్స్ యాంకర్‌ ఫఖర్ ఆలం స్పందించారు. పాక్‌ దేశంలోని ఆహారాన్ని ఎంఎస్‌ ధోనీ ఇష్టపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేవలం క్రికెట్ కోసమే కాదు.. ఆహారం కోసం కూడా ఓ సారి పాకిస్థాన్‌కు రావాలని మహీకి ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు ఫకర్‌ ఆలం. పాకిస్థాన్‌ నుంచి ఆహ్వానం రావడంతో.. ఎంఎస్‌ ధోనీకి చాలా మంది అభిమానులు ఉంటారనీ దాయాది దేశం నుంచి కూడా ఆహ్వానం రావడం సంతోషంగా ఉందంటూ పలువురు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. దటీజ్‌ ధోనీ అంటున్నారు.


Next Story