పొరపాటుగా క‌రెక్ట్ ప‌ని చేశారు

ఫిబ్రవరి 22, శనివారం నాడు ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు ముందు లాహోర్‌లో భారత జాతీయ గీతం ప్లే చేశారు.

By Medi Samrat  Published on  22 Feb 2025 2:15 PM IST
పొరపాటుగా క‌రెక్ట్ ప‌ని చేశారు

ఫిబ్రవరి 22, శనివారం నాడు ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు ముందు లాహోర్‌లో భారత జాతీయ గీతం ప్లే చేశారు. ఆస్ట్రేలియన్ జాతీయ గీతానికి బదులుగా 'జనగణమన' ప్లే చేశారు. నిర్వాహకులు పొరపాటును గ్రహించి భారత జాతీయ గీతాన్ని ఆపడానికి ముందే ఆస్ట్రేలియా ఆటగాళ్లు, గడ్డాఫీ స్టేడియంలోని ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగో మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు మాత్రమే కాదు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. గ్రూప్- బిలో భాగంగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్యాట్ కమిన్స్ లేకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ నాయకత్వం వహిస్తున్నాడు.

తుది జట్లు:

ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.

ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

Next Story