టోక్యో ఒలింపిక్స్‌.. న్యూజిలాండ్‌పై భారత్ విజ‌యం

Indian men's hockey team beat New Zealand 3-2.ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌ హాకీ జ‌ట్టు జట్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2021 10:34 AM IST
టోక్యో ఒలింపిక్స్‌.. న్యూజిలాండ్‌పై భారత్ విజ‌యం

ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌ హాకీ జ‌ట్టు జట్టు శుభారంభం చేసింది. పురుషుల హాకీలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్ లో ఇండియా 3-2 తేడాతో విజ‌యం సాధించింది. హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్‌(26ని, 33ని) రెండు గోల్స్‌తో భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. మ్యాచ్ ప్రారంభ‌మైన ఆరో నిమిషంలోనే న్యూజిలాండ్‌కు కేన్ ర‌సెల్ గోల్ చేసి 1-0 లీడ్ సాధించి పెట్టాడు. అయితే ఆ త‌ర్వాత 10వ నిమిషంలో రూపింద‌ర్ పాల్ సింగ్ గోల్‌తో స్కోరు స‌మం చేశాడు.

ఆ వెంట‌నే హ‌ర్మ‌న్‌ప్రీత్ మ‌రో గోల్ చేసి లీడ్‌ను 2-1కి పెంచాడు. సెకండ్ క్వార్ట‌ర్‌లోనూ హ‌ర్మ‌న్‌ప్రీత్ మ‌రో గోల్‌తో భార‌త్‌ లీడ్ 3-1కి పెరిగింది. ఇక మూడో క్వార్ట‌ర్ చివ‌రి నిమిషంలో న్యూజిలాండ్ ప్లేయ‌ర్ స్టీఫెన్ జెన్నెస్ గోల్‌తో టీమిండియా లీడ్‌ను 2-3కి త‌గ్గించాడు. చివ‌రి క్వార్ట‌ర్‌లో ఇండియా స్కోరును స‌మం చేయ‌డానికి న్యూజిలాండ్ ప్ర‌య‌త్నించినా.. ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ స‌మ‌ర్థంగా అడ్డుకున్నారు. మ‌రో 24 సెక‌న్ల‌లో ఆట ముగుస్తుంద‌న‌గా కివీస్‌కు ల‌భించిన పెనాల్టీ కార్న‌ర్‌ను గోల్‌కీప‌ర్ శ్రీజేశ్ అడ్డుకున్నాడు. దీంతో భార‌త్ 3-2తో న్యూజిలాండ్ పై విజ‌యాన్ని సాధించింది. కాగా.. ఆదివారం ప‌టిష్టమైన ఆస్ట్రేలియాతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.

Next Story